సలార్ మూవీ టీజర్ రివ్యూ.. రూ.5 వేల కోట్లు సాధించే మాస్ బొమ్మ ఇదేనంటూ?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్( Prabhas ) నటించిన సలార్ మూవీ( Salaar Movie ) నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.
ఒక భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించిన టీజర్ ఉదయం 5 గంటల సమయంలో రిలీజ్ కావడం అయినప్పటికీ ఈ టీజర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ రావడం సలార్ విషయంలోనే సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
106 సెకన్ల వీడియోలో ప్రభాస్ కనిపించింది కొన్ని షాట్స్ లో మాత్రమే అయినా ఆ షాట్స్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి.
ఈ టీజర్ ను చూసిన ప్రభాస్ అభిమానులు రూ.5 వేల కోట్ల కలెక్షన్లు సాధించే మాస్ బొమ్మ ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.
కేజీఎఫ్ 2( KGF 2 ) సినిమాను మించిన సినిమాను చూస్తున్నామనే భావనను మాత్రం మేకర్స్ కలిగించారు.
బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడలేదని టీజర్ చూస్తే అర్థమవుతోంది.
డార్క్ షేడ్స్ లో ఈ సినిమా తెరకెక్కిందని ఈ టీజర్ ను చూస్తే అర్థమవుతుండటం గమనార్హం.
"""/" /
పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ఈ టీజర్ లో కొన్ని సెకన్ల పాటు కనిపించారు.
సలార్ మూవీకి ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సలార్ టీజర్( Salaar Teaser ) అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చేలా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఏప్రిల్ 28వ తేదీన విడుదలైన బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించగా H3 Class=subheader-styleసెప్టెంబర్ 28వ తేదీన/h3p రిలీజ్ కానున్న సలార్ మూవీ అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాల్సి ఉంది.
"""/" /
సలార్ మూవీ టీజర్ ఊహించని స్థాయిలో అంచనాలను పెంచగా ట్రైలర్ ఏ స్థాయిలో అంచనాలను పెంచుతుందో చూడాల్సి ఉంది.
ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబో క్రేజీ కాంబో కావడంతో ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సలార్ మూవీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఇదేందయ్యా ఇది.. బహుశా ఆ ఇద్దరికీ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదేమో.. వీడియో వైరల్..