ప్రభాస్ సలార్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఆ క్రిటిక్ ఏం చెప్పారంటే?

ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ థియేటర్లలో విడుదల కావడానికి మరో పది నెలల సమయం ఉంది.

ప్రభాస్, శృతి హాసన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడగా సెప్టెంబర్ 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.

ప్రశాంత్ నీల్ ఈ సినిమా కోసం ఒక విధంగా ప్రాణం పెడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ప్రభాస్ మూవీ రిలీజ్ కు చాలా సమయం ఉన్నా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.

ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు ఈ సినిమా గురించి మాట్లాడుతూ సలార్ సినిమాకు సంబంధించి 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోను చూశానని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

తాను సలార్ రషెస్ చూశానని అంచనాలకు అందని స్థాయిలో సలార్ మూవీ ఉండబోతుందని తెలిపారు.

వచ్చే ఏడాది ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉమైర్ సంధు కామెంట్లు పాజిటివ్ గా ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు.ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

"""/"/ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన రికార్డులు అన్నీఇన్నీ కావు.

ప్రశాంత్ నీల్ తర్వాత సినిమాలు కూడా అద్భుతాలు చేసే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఇప్పటివరకు పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రలో ప్రభాస్ ఈ సినిమాలో కనిపించనున్నారు. """/"/ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించిన నేపథ్యంలో సలార్ సినిమా కూడా అదే ఫలితాన్ని సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి.

సైబీరియన్ పులి ప్రేమ ప్రయాణం.. 200 కి.మీ దాటి, ప్రేయసి చెంతకు!