'సలార్' క్లైమాక్స్ బెంచ్ మార్క్ లెవల్ లో నిలబెడతాం అంటున్న నీల్!
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో సలార్ ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుకుంటున్నారు.
ఎందుకంటే ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న నీల్ కెజిఎఫ్ తో సంచలనం సృష్టించాడు.
దీంతో ప్రభాస్ తో చేసే సలార్ సినిమా కూడా ఈ రేంజ్ లోనే ఉంటుంది అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
ఇక మొన్నటి వరకు ఆగిపోయిన ఈ షూట్ ఇటీవలే స్టార్ట్ అయ్యి శరవేగంగా పూర్తి అవుతుంది.
ఈయన ఇప్పటి వరకు పోషించని పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా 2023 సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు.
"""/"/
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి తాజాగా ప్రశాంత్ నీల్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు.
ఇటీవలే కన్నడ నుండి కాంతారా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయినా విషయం తెలిసిందే.
ఈ సినిమా చిన్న సినిమా అయినా కన్నడ లోనే ఇప్పటికే 60 కోట్లకు పైగానే వసూలు చేసింది.
ఈ సినిమాలో ముఖ్యంగా క్లైమాక్స్ గురించి చాలా మంది మాట్లాడు కుంటున్నారు.ఇక తాజాగా ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా విషయంలో స్పందించారు.
ఈ సినిమాను నీల్ బాగా ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు.ముఖ్యంగా క్లైమాక్స్ బాగా నచ్చింది అంటూ ప్రశంసించారు.
ఈ క్రమంలోనే సలార్ క్లైమాక్స్ గురించి కూడా స్పందించారు.సలార్ క్లైమాక్స్ ని కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసే రేంజ్ లో నిలబెడతాం అంటూ చెప్పడంతో డార్లింగ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రిషబ్ శెట్టి కాంతార2 మూవీకి మరో భారీ షాక్ తగిలిందా.. అసలేం జరిగిందంటే?