దసరా సూపర్ అనేసిన ప్రభాస్..!

నాని( Nani ) దసరా సినిమాకు ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ రివ్యూ ఇచ్చి సినిమాకు మరింత బూస్టింగ్ ఇస్తే లేటెస్ట్ గా రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas )కూడా దసరా సినిమా సూపర్ అనేశాడు.

దసరా చూశాను.వాటే ఫిల్మ్.

బాగా నచ్చేసింది.ఈ సినిమా చేసినందుకు నానికి కంగ్రాట్స్.

డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు కూడా కంగ్రాట్స్ అని ప్రభాస్ తన సోషల్ మీడియా( Social Media ) పేజ్ లో కామెంట్ చేశారు.

ఇలాంటి సినిమాలు మనం చేయాల్సింది అంటూ చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్ చెప్పారు.మొన్న మహేష్ నేడు ప్రభాస్ ఇలా ఇద్దరు సూపర్ స్టార్స్ దసరా సినిమా గురించి కామెంట్ చేయడం అందరిని సర్ ప్రైజ్ చేసింది.

కొత్త దర్శకుడే అయినా శ్రీకాంత్ దసరా సినిమాను చాలా క్లవర్ గా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో నాని నెక్స్ట్ లెవల్ లో నటించాడు.తన రెగ్యులర్ ఫార్మట్ ని దాటి సినిమాలో ఊర మాస్ యాటిట్యూడ్ తో నాని అదరగొట్టాడు.

సినిమాకు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ రాగా వసూళ్లతో దూసుకెళ్తుంది.ఇక ఈ సినిమాకు స్టార్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ కూడా సినిమాకు బాగా హెల్ప్ అవుతుంది.

ప్రభాస్ దసరా చూసి చేసిన కామెంట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.చిత్ర యూనిట్ కూడా థ్యాంక్స్ టు రెబల్ స్టార్ అంటూ ప్రభాస్ కు కృతజ్ఞతలు తెలిపింది.

బన్నీని ట్రోల్ చేయొద్దు.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!