యూ టర్న్ తీసుకున్న ప్రభాస్.. అంతా దాని పుణ్యమే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జాన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాను ఓ పీరియాడికల్ లవ్ స్టోరీగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్ట్ చేస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్‌ను ప్రస్తుతం ఫారిన్ ప్రదేశాల్లో జరిపేందుకు చిత్ర యూనిట్ జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే.

అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ధాటికి అన్ని కార్యక్రమాలను ఆయా దేశాల ప్రభుత్వాలు రద్దు చేస్తుండటంతో, విదేశాలకు వెళ్లి జరిపే షూటింగ్‌లను సైతం క్యాన్సిల్ చేస్తున్నారు.

దీంతో జాన్ సినిమా యూనిట్‌‌ను కూడా అక్కడి ప్రభుత్వం షూటింగ్ ఆపేయాల్సిందిగా ఆదేశించడంతో, ప్రభాస్ తిరిగి ఇండియా వచ్చేందుకు రెడీ అయ్యాడు.

ఇక ప్రభాస్‌తో పాటు పూజా హెగ్డే, దర్శకుడు రాధాకృష్ణలు కూడా ఇండియా వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశస్థులను తమ దేశంలోకి ప్రవేశించకుండా ఆయా దేశాలు తీసుకుంటున్న జాగ్రత్తలు మన ఇండియాలో కూడా తీసుకుంటున్నారు.

దీంతో ఫారన్ వీసాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.మరి జాన్ చిత్ర షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది.

యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిర్బంధంలో 41 వేల మంది.. భారతీయులు ఎంత మంది అంటే?