'రాధేశ్యామ్' షూట్ ను రీస్టార్ట్ చేసిన డార్లింగ్ !

బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ వరస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.

ప్రస్తుతం ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు.సాహో సినిమా తర్వాత రాధేశ్యామ్ సినిమాను మొదలు పెట్టారు.

రెండు సంవత్సరాలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు.ఈ సినిమా ఎప్పుడో రావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా జులై 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

కానీ మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది.దీని కారణంగా మళ్ళీ వాయిదా పడింది.

ఈ సినిమా దాదాపు 90 శాతం పూర్తి చేసుకుంది.ఇంకా కొద్దీ భాగం మిగిలి ఉండడంతో దానిని తొందరగా పూర్తి చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారు.

"""/"/ అయితే ఈ రోజు ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఎప్పటి నుండో ఈ సినిమా షూటింగ్ రీస్టార్ట్ అవుతుందని చెప్పినప్పటికీ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారో ఇంత వరకు ప్రకటించలేదు.

అయితే ఈ రోజు ఈ షూటింగ్ ను రీస్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.ఈ సినిమా కొద్దీ భాగం మాత్రమే ఉండడంతో ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొన బోతున్నడని తెలుస్తుంది.

"""/"/ ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ కు జంటగా పూజ హెగ్డే నటిస్తున్నారు.

యువీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ ఈ సినిమాతో పాటుగా సలార్, ఆది పురుష్ సినిమాలు కూడా అనౌన్స్ చేసి షూటింగ్ కూడా స్టార్ట్ చేసాడు.

ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ పూర్తి చేయాలనీ ప్రభాస్ అనుకుంటున్నాడు.

బన్నీ అరెస్ట్ అయితే జానీ మాస్టర్ హ్యాపీగా ఉన్నారా.. ఆయన రియాక్షన్ ఏంటంటే?