Prabhas Rana Daggubati : రానా తో చేయాల్సిన సినిమా ప్రభాస్ దగ్గరికి ఎలా వెళ్లిందంటే..?

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమా( Leader Movie )తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన రానా మొదటి సినిమాతోనే నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

అయితే ఈ సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అవ్వకపోవడంతో రానా మొదటి స్టెప్ లోనే హీరోగా ఫెయిల్ అయ్యాడు.

ఇక ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు.

ఇక ఈ క్రమంలోనే ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా( Ullasamga UtsahamgaUllasamga Utsahamga )తో మంచి విజయాన్ని అందుకున్న కరుణాకరన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన డార్లింగ్ సినిమా ని మొదట రానా తోనే చేయాలని ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది.

అయితే రానా ఈ సినిమాతోనే సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇద్దామని ప్లాన్ చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు అయితే క్యాన్సిల్ అయింది.

"""/"/ ఇక దాంతో రానా( Rana Daggubati ) లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే ఈ సినిమాని డార్లింగ్( Darling ) పేరుతో కరుణాకరన్ ప్రభాస్ హీరోగా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

ఇక ఈ సినిమాతో ప్రభాస్ కి కూడా ఒక భారీ బ్లాక్ బాస్టర్ హిట్టు పడిందనే చెప్పాలి.

ఇక ఒక్కసారి గా ప్రభాస్ రెబల్ స్టార్ గా తన పంజాని విసిరాడనే చెప్పాలి.

"""/"/ ఇక మొత్తానికైతే రానా చేయాల్సిన సినిమాతో ఒక భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఈ సినిమా రూపం లో ఒక పెద్ద సక్సెస్ వచ్చిందనే చెప్పాలి.

ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పాన్ ఇండియా లో ప్రభాస్ చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లు అవుతున్నాయి.

అలాగే ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు.

350 మంది అభిమానులకు లంచ్ ఏర్పాటు చేసిన సాయితేజ్.. ఈ మెగా హీరో గ్రేట్!