ప్రభాస్ రెమ్యునరేషన్ ముందు రజినీకాంత్ కూడా పనికి రాడు
TeluguStop.com
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ హీరో సినిమాలు విడుదలైతే తప్పకుండా అటు టాలీవుడ్ ప్రేక్షకులు చూసే వారు.
టాలీవుడ్ ప్రేక్షకులు కాకుండా దక్షిణాదిచిత్ర పరిశ్రమలో ప్రేక్షకులు కూడా బాగా ఆదరించేవారు.కానీ బాహుబలి సినిమా తర్వాత మాత్రం ప్రభాస్ సినిమాల క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
ఒకప్పుడు కేవలం టాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన డార్లింగ్ ప్రభాస్ ఇక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు.
దీంతో ఎంతో మంది దర్శక నిర్మాతలు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సినిమా తీయాలని భావిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు రాజమౌళి ఎంతో మంది హీరోలతో సినిమాలు తీశాడు.ఇక రాజమౌళి సినిమాలతో ఆ హీరోలకు కూడా క్రేజ్ పెరిగిపోయింది.
కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం వరుసగా ప్లాపులతో ఎంతగానో ఇబ్బందులు పడ్డారు.
కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి సినిమా తర్వాత ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు.
ఎంతలా అంటే జపాన్ దేశంలో మిల్క్ బాటిల్స్ పై కూడా ప్రభాస్ ఫోటోలు ప్రచురించి ప్రచారం చేస్తున్నారు అంటే ఇక ప్రభాస్ క్రేజ్ భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతలా పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిన తర్వాత ప్రభాస్ రెమ్యునరేషన్ పెంచకుండా ఊరుకుంటాడా.
ఇక ఇప్పుడు పారితోషికం విషయంలో ఎవరికీ అందనంత దూరంలో ప్రభాస్ ఉన్నాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది.
"/" /
కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోనే ఏ హీరో అందుకో లేనంత ఎక్కువగా పారితోషకాన్ని అందుకుంటున్నాడట ప్రభాస్.
వరుసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న ప్రభాస్ ఒక్కో సినిమాకి 150 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటూ ఉన్నాడట.
"""/" /
ఇప్పటివరకు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక్క సినిమాకు ఏ హీరో కూడా ఇంత మొత్తంలో పారితోషికం అందుకోలేదని చెప్పాలి.
ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.ప్రస్తుతం ఆది పురుష్, రాధేశ్యామ్, స్పిరిట్, సలార్, ప్రాజెక్ట్ కి లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తుండగా ఈ మొత్తం సినిమాల బడ్జెట్ 1500 కోట్ల వరకు ఉంటుందట.
ఈ రేంజ్ లో క్రేజ్ ఉన్న తర్వాత 150 కోట్ల రెమ్యూనరేషన్ అందుకోవడంలో తప్పేం లేదు అంటున్నారు అభిమానులు.
అల్లరి నరేష్, బెల్లంకొండ శ్రీనివాస్ ల పరిస్థితి ఏంటి..?