ఆ ప్లాన్ వర్కౌట్ అయితే రాజాసాబ్ కు రూ.1000 కోట్లు పక్కా.. అసలేమైందంటే?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్.( Hero Prabhas.

) ప్రస్తుతం దేశవ్యాప్తంగానే కాకుండా పాన్ ఇండియా లెవెల్లో మారుమోగుతున్న పేరు.ముఖ్యంగా గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో డార్లింగ్ ప్రభాస్ పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే.

కాగా డార్లింగ్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించడంతోపాటు ఆ సినిమాలో వరుసగా విజయాలు సాధిస్తుండడంతో ప్రభాస్ కి ఉన్న అభిమానుల సంఖ్య మరింత పెరుగుతోంది.

ఇకపోతే తాజాగా ప్రభాస్ కల్కి మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు మరిన్ని రికార్డులు సాధిస్తూ వసూళ్ల దిశగా దూసుకుబోతోంది.

లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటె ప్రభాస్ నుంచి నెక్స్ట్ రాబోయే ది రాజా సాబ్ సినిమా( The Raja Saab Movie ) సందడి అప్పుడే మొదలు కాబోతోంది.

"""/" / తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఈ గ్లింప్స్ లో డార్లింగ్ ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడనే మాట వినిపిస్తోంది.

చాలా రోజుల తర్వాత ప్రభాస్ ని రొమాంటిక్ లుక్ లో ప్రేక్షకులు ఆశించిన విధంగా చూస్తున్నారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాకుండా తాజాగా విడుదల చేసిన ఈ గ్లింప్స్ తో ది రాజా సాబ్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి.

మారుతి ఈ మూవీతో ఏదో మాయ చేయబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.ఏప్రిల్ 10, 2025న రాజా సాబ్ మూవీ థియేటర్స్ లోకి రానున్నట్లు అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు.

నిజానికి ఈ చిత్రాన్ని ముందుగా ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తారని భావించారు.

ఒకవేళ కుదరకుంటే 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.

అయితే చిత్ర యూనిట్ మాత్రం వేరే విధంగా ఆలోచించింది. """/" / అందుకే ఏప్రిల్ 10న సమ్మర్ హాలిడేస్ కలిసి వచ్చే విధంగా ది రాజా సాబ్ రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసింది.

ఏప్రిల్ నెలలో అంటే ఆల్ మోస్ట్ స్కూల్స్, కాలేజీలకు సమ్మర్ సెలవులు మొదలైపోతాయి.

సమ్మర్ హాలిడేస్ ఆరంభంలోనే ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతోంది.కాబట్టి ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపించే ఛాన్స్ ఉంది.

సినిమాకి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా సుదీర్ఘ లాంగ్ రన్ లభించడం గ్యారంటీ అనే మాట వినిపిస్తోంది.

అలాగే 1000 కోట్ల కలెక్షన్స్ ఈజీగా అందుకోవచ్చని భావిస్తున్నారు.దీనిని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ లో సమ్మర్ స్పెషల్ గా ది రాజా సాబ్ చిత్రాన్ని థియేటర్స్ లోకి తీసుకొని రాబోతున్నారు.

డార్లింగ్ ప్రభాస్ కెరియర్ లో పౌర్ణమి, మున్నా, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి సినిమాలు ఏప్రిల్ నెలలో రిలీజ్ అయ్యి మెజారిటీగా సక్సెస్ అందుకున్నాయి.

ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ సినిమాకి కూడా ఏప్రిల్ నెల కలిసి వస్తుందని భావిస్తున్నారు.

ఒకవేళ అదే సెంటిమెంట్ కనుక వర్కౌట్ అయితే కల్కి సినిమా ఈజీగా 1000 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

వావ్, తారక్‌కి పునర్జన్మ కలిగిన రోజే లక్ష్మీ ప్రణతి పుట్టిందట..?