క్లిక్ క్లిక్‌ : రాధే శ్యామ్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు ఇలా జరుగుతున్నాయి

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సినిమా గత నాలుగు ఏళ్లుగా ఊరిస్తూ ఉంది.

ఎట్టకేలకు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు జాతీయ స్థాయి అంచనాల నడుమ రాబోతుంది.

హిందీ తో పాటు ప్రతి ఒక్క ఇండియన్ లాంగ్వేజ్ జనాలు కూడా రాధే శ్యామ్‌ ను చూడాలనే ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు.

సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు అయ్యాయి.ఇప్పటి వరకు జరగనటువంటి ఒక భారీ నేషనల్‌ లెవల్‌ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.

రికార్డులను బ్రేక్‌ చేసేంతటి జనం మరియు దేశ వ్యాప్తంగా పలు ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు.

ఈనెల 23న రామోజీ ఫిల్మ్‌ సిటీ మెయిన్ గేట్‌ వద్ద జరుగబోతున్న ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి.

భూమి పూజ నిర్వహించి.పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.

శ్రేయాస్ మీడియా వారు ఈ భారీ వేడుకను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.ఇప్పటి వరకు శ్రేయాస్ మీడియా ఎన్నో భారీ ఈవెంట్స్ ని నిర్వహించడం జరిగింది.

ఖచ్చితంగా ఈ ఈవెంట్‌ ను కూడా అత్యంత భారీ ఎత్తున నిర్వహించి సక్సెస్ ను దక్కించుకుంటారనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

"""/" / చాలా నమ్మకంతో యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బాధ్యతను శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ గారికి అప్పగించడం జరిగింది.

ఆయన ఏమాత్రం లోటు లేకుండా అభిమానుల కోసం.వచ్చే అతిథుల కోసం ఏర్పాట్లు చేయిస్తున్నారు.

ఈ ఈవెంట్ ను శ్రేయాస్ శ్రీనివాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లుగా తెలుస్తోంది.రాధే శ్యామ్‌ మూవీ సంక్రాంతికి విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ లో వంశీ మరియు ప్రమోద్ లు నిర్మించారు.

భారతీయుల అక్రమ రవాణా.. కెనడియన్ కాలేజీల ప్రమేయం, రంగంలోకి ఈడీ