ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాకు నష్టం అన్ని కోట్లా.. ప్రభాస్ చేసిన తప్పు అదే అంటూ?

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్ మూవీ ఈ నెల 11వ తేదీన థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.

ఈ సినిమా బయ్యర్లకు ఏకంగా 100 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో గతంలో ఏ సినిమాకు రాని స్థాయిలో రాధేశ్యామ్ సినిమాకు నష్టాలు వచ్చాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

కళ్లు చెదిరే రేటుకు రాధేశ్యామ్ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు ఈ సినిమా రిజల్ట్ ను చూసి దిగులు చెందారు.

రాధేశ్యామ్ సినిమాకు సెకండ్ వీకెండ్ పూర్తి కావడంతో ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపుగా ముగిసినట్టేనని చెప్పాలి.

రాధేశ్యామ్ సినిమా తెలుగు రాష్ట్రాల వరకు, ఓవర్సీస్ లో పరవాలేదనే స్థాయిలో కలెక్షన్లను సాధించింది.

ఇతర రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకుంది.దాదాపుగా 200 కోట్ల రూపాయల బిజినెస్ చేసిన రాధేశ్యామ్ ఇంత తక్కువ మొత్తం కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ సైతం ఊహించలేదు.

"""/" / రిలీజ్ రోజున యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత రోజుల్లో ఫ్లాప్ గా నిలిచింది.

అయితే ఈ సినిమా రిజల్ట్ నేపథ్యంలో ప్రభాస్ కెరీర్ విషయంలో తప్పటడుగులు వేయకుండా జాగ్రత్త పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

యాక్షన్ హీరోగా ప్రభాస్ కు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉన్న నేపథ్యంలో ప్రభాస్ క్లాస్ కథలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు.

కొన్నేళ్ల క్రితం ప్రభాస్ క్లాస్ కథలతో హిట్లు సాధించారు. """/" / అయితే అప్పుడు ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ కు ఇప్పుడు ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ కు ఊహించని స్థాయిలో తేడా ఉంది.

ప్రభాస్ కథల విషయంలో పొరపాట్లు చేస్తే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.

కెరీర్ విషయంలో పొరపాట్లు చేయకుండా ప్రభాస్ ఇకనైనా జాగ్రత్త పడతారేమో చూడాల్సి ఉంది.

పుట్టినరోజు వేల గొప్ప మనసు చాటుకున్న సితార.. తండ్రికి తగ్గ తనయ?