రాధేశ్యామ్@ రూ.400 కోట్లు... ఇది నిజమా? అబద్దమా?

ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన రాధేశ్యామ్‌ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

ఆ సినిమాకు పాజిటివ్ టాక్ తో పాటు నెగటివ్‌ టాక్‌ కూడా వచ్చింది.

మిశ్రమ స్పందన దక్కించుకున్న రాధేశ్యామ్‌ సినిమా ఒక మోస్తరు దక్కించుకుంటున్న ప్రతి ఒక్కరు అంచనా చేశారు.

కానీ అనూహ్యంగా సినిమా దారుణమైన పరాజయాన్ని మూట గట్టుకుంది.ముఖ్యం గా బాలీవుడ్ లో ఈ సినిమా రూ.

100 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తే కనీసం రూ.15 కోట్లు కూడా వసూలు చేయ లేక డీలా పడిపోయింది.

ఈ సినిమా కి ది కశ్మీర్‌ పైల్స్ సినిమా చాలా డ్యామేజ్ చేసింది అంటూ ట్రేడ్ వర్గాల వారి నుండి సమాచారం అందుతుంది.

ఇక ఈ సినిమా 400 కోట్ల రూపాయలను వసూలు చేసింది అంటూ ఒక వర్గం ప్రేక్షకులు సోషల్‌ మీడియా లో ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమా రెండు వందల కోట్ల కు పైగా వసూలు చేసింది.

అది కూడా ఈ సినిమా లాంగ్‌ రన్‌ పూర్తి అయ్యే సరికి మరో పది కోట్ల వరకు అదనంగా సాధించే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా నాలుగు వందల కోట్లు వసూలు చేసింది అనేది కేవలం పుకారు మాత్రమే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

"""/"/ ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు తెరకెక్కించడం జరిగింది.దాదాపు రూ.

350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ఇలా దారుణమైన పరాజయాన్ని మూట కట్టుకోవడం తో చిత్ర నిర్మాణ సంస్థ తీవ్ర నిరాశ పాలయింది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ పెట్టిన పెట్టుబడి కి ఏ మాత్రం సంబంధం లేకుండా ఉంది.

400 కోట్లు నిజంగానే వచ్చినట్లయితే కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్.

కానీ అంత సీన్ లేదు అంటూ స్వయంగా ప్రభాస్ అభిమానులు భావిస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి6, సోమవారం 2025