ప్రభాస్ సినిమాలో బ్రహ్మి కామెడీ..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాకు రీసెంట్ గా ముహుర్త కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే.

ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనిదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది.సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు.

సినిమా ఓపెనింగ్ కు అమితాబ్ కూడా అటెండ్ అవడం విశేషం.ఈ సినిమాకు ప్రాజెక్ట్ కె అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.

ఈ సినిమా నుండి ఒక క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది.సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా వస్తున్నా కామెడీకి ఇంపార్టెన్స్ ఉంటుందట అందుకే కామెడీ కింగ్ బ్రహ్మానందం ను ఈ సినిమాలో తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

ఈ సినిమాలో బ్రహ్మానందం కోసం ఫుల్ లెంగ్త్ రోల్ రాశారట.హీరోతో ఈక్వల్ గా ఈ రోల్ ఉంటుందని చెబుతున్నారు.

హాలీవుడ్ రేంజ్ సినిమాలో బ్రహ్మి కామెడీ కూడా స్పెషల్ అడ్వాంటేజ్ కానుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఇంకా చాలా సర్ ప్రైజెస్ ఉంటాయని చెబుతున్నారు. సలార్, ఆదిపురుష్ పూర్తి చేశాక ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

పక్కవారి జీవితంపై బురదజల్లే ముందు నీ జీవితం ఎలా ఉందో చూసుకో !