ఆ సినిమాలో రొమాంటిక్ రోల్ లో ప్రభాస్.. మరో క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Star Hero Prabhas ) కు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతోంది.
ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలపై అంచనాలు పెరుగుతుండటం గమనార్హం.
ఫౌజీ సినిమాకు( Fouji Movie ) హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమకు ఊహించని స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.
హను రాఘవపూడి సినిమాలో ప్రభాస్ రొమాంటిక్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.1945 బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇమాన్వి ఇస్మాయిల్ ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపించనున్నారు.
బ్రిటిష్ సైన్యంలో సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
ప్రభాస్ ఇప్పటివరకు సినీ కెరీర్ లో పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించలేదు.
ఫౌజీలో ఆర్మీ ఆఫీసర్ గా ప్రభాస్ కనిపించడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.
"""/" /
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని భోగట్టా.
ప్రభాస్, ఇమాన్వి ఇస్మాయిల్ ( Prabhas, Imanvi Ismail
)మధ్య వచ్చే సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని తెలుస్తోంది.
ఫౌజీ సినిమా విడుదలైన తర్వాత ఇమాన్వి ఇస్మాయిల్ వరుస ఆఫర్లతో బిజీ కావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఫౌజీ సినిమా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తెరకెక్కుతోంది. """/" /
రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ వేశారని సమాచారం అందుతోంది.
జయప్రద, మిథున్ చక్రవర్తి ( Jayaprada, Mithun Chakraborty )ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
దాదాపుగా ఏడాది పాటు కష్టపడి హను రాఘవపూడి ఈ సినిమా కథను సిద్ధం చేశారు.
ఈ సినిమాతో టాలీవుడ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సినిమా సినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
అనుదీప్ విశ్వక్ సేన్ ఇద్దరు కలిసి భారీ సక్సెస్ కొట్టబోతున్నారా..?