Prabhas : మాస్ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయిన ప్రభాస్…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలలో ప్రభాస్( Prabhas ) ఒకరు.

ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్నాయి.

ఇక ఇప్పటికే ప్రభాస్ రాజాసాబ్,( Rajasaab ) కల్కి( Kalki ) లాంటి సినిమాలను పూర్తిచేసే పనిలో ఉన్నాడు.

ఆ తర్వాత స్పిరిట్ సినిమా చేయబోతున్నాడు.ఇక దాంతోపాటు హను రాఘవ పూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

ఇక ఇప్పుడు కొత్తగా మరో సినిమాకి కూడా కమిట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.తెలుగు లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన బోయపాటి శ్రీను( Boyapati Srinu ) దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇప్పటికే బాలయ్య, అల్లు అర్జున్ లతో సినిమాలు చేయడానికి కమిట్ అయిన బోయపాటి మరి ఇలాంటి క్రమంలో ప్రభాస్ కి కూడా ఒక కథ వినిపించినట్లు గా తెలుస్తుంది.

"""/" / అయితే ఆ కథ ప్రభాస్ కి నచ్చడం తో ఆ సినిమా ప్రభాస్ చేయబోతున్నట్టు గా కూడా వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ ప్రాజెక్టు రెడీ అవ్వడానికి మరొక రెండు సంవత్సరాలు పడుతుంది.కాబట్టి ఈలోపు బోయపాటి బాలయ్య,( Balakrishna ) అల్లు అర్జున్ లతో( Allu Arjun ) సినిమాలను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు.

అలాగే ప్రభాస్ కూడా ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేసి బోయపాటి తో సినిమా చేయాలని చూస్తున్నాడు.

"""/" / ఇక రీసెంట్ గా స్కంద సినిమాతో భారీ ఫ్లాప్ ను అందుకున్న బోయపాటి ఇప్పుడు ప్రభాస్ కు ఎలాంటి ఎలివేషన్స్ ఇస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.

నిజానికి బోయపాటి తో సినిమా చేయడానికి చాలామంది హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఎందుకంటే ఆ సినిమా కనక సక్సెస్ అయితే వాళ్లకు భారీ క్రేజ్ వస్తుందని నమ్ముతారు కాబట్టి వాళ్లు ఆ సినిమాకి కమిట్ అవుతారు.

మరి బోయపాటి ఇప్పుడు ప్రభాస్ ను ఎలా చూపిస్తాడు అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

గోళ్లు దృఢంగా పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!