దిల్‌ రాజుకు ఎందుకు ప్రభాస్ హ్యాండ్ ఇచ్చినట్లు?

యంగ్‌ రెబల్‌ స్టార్‌ 25వ సినిమా దిల్ రాజు బ్యానర్‌ లో అని.

అందుకు సంబంధించిన కథను కూడా దిల్‌ రాజు రెడీ చేయించాడు అంటూ వార్తలు వచ్చాయి.

గత నాలుగు అయిదు నెలలుగా ఈవిషయమై పతాక స్థాయిలో ప్రచారం జరిగింది.కాని తీరా చూస్తే దిల్‌ రాజుకు ప్రభాస్ తన 25వ సినిమా ఆఫర్ ను ఇవ్వలేదు.

టీ సీరీస్ నిర్మాణంలో అర్జున్‌ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో చేసేందుకు సిద్దం అయ్యాడు.

ప్రభాస్ మరియు సందీప్ వంగల కాంబో మూవీ ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది కనుక దిల్‌ రాజు కు ప్రభాస్ హ్యాండ్‌ ఇచ్చినట్లే కదా అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను 2023 లో విడుదల చేస్తారని అంటున్నారు.

"""/"/ దిల్‌ రాజు నిర్మాణంలో ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా.విజయ్‌ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది.

దిల్‌ రాజు ఒకే సారి రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్నాడు.

ప్రభాస్ అవకాశం ఇస్తే మరో భారీ సినిమా అవుతుందని అంతా ఆశించారు.కాని అనూహ్యంగా సినిమా ఛాన్స్ ను ప్రభాస్ ఇవ్వలేదు.

దిల్‌ రాజు కు ఇప్పుడు కాకున్నా ఆ తర్వాత అయినా ప్రభాస్ ఖచ్చితంగా ఛాన్స్‌ ఇస్తాడనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ప్రస్తుతం రాధే శ్యామ్‌ సినిమా విడుదల పనిలో బిజీగా ఉన్న ప్రభాస్ ఆ వెంటనే సలార్‌ మరియు ఆదిపురుష్ లను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు.

ప్రాజెక్ట్ కే సినిమా కోసం కూడా అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇవన్నీ కూడా రికార్డ్‌ బ్రేకింగ్‌ సినిమాలే.

ఖచ్చితంగా ఇవి ఒక రేంజ్ లో ఉంటాయి అనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి వంటి ఒక విభిన్నమైన సినిమాను ప్రభాస్‌ తో సందీప్‌ వంగ తీస్తాడనే నమ్మకంను అంతా వ్యక్తం చేస్తున్నారు.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్… ఓకే చెప్పిన అల్లు అర్జున్?