ప్రభాస్ కంటే ముందు మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయబోతున్న దర్శకుడు

అర్జున్ రెడ్డి సినిమా తో దర్శకుడిగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ.

ఈయన అర్జున్ రెడ్డి ని హిందీ లో తెరకెక్కించి సూపర్ హిట్ పొందిన విషయం తెలిసిందే.

హిందీ లో అర్జున్ రెడ్డి సూపర్ హిట్ అవడం తో సందీప్ రెడ్డి వంగ కి వరుసగా అక్కడ ఆఫర్స్ దక్కాయి.

ప్రస్తుతం స్టార్ హీరో తో హిందీ లో యానిమల్‌ అనే సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

అంతే కాకుండా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా ను తెరకెక్కించబోతున్నట్లుగా కూడా దర్శకుడు సందీప్ వంగా ప్రకటించాడు.

ప్రస్తుతం చేసిన హిందీ సినిమా పూర్తి అయిన వెంటనే ప్రభాస్ హీరో గా సినిమా ను చేస్తాడని అంతా భావించారు.

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ సినిమా కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి హీరో గా ఒక సినిమా ను సందీప్ చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే సంవత్సరం ప్రారంభంలోనే వస్తుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

"""/"/ హిందీ లో ఈయన తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమా ముగింపు దశ కు చేరుకున్నట్లుగా తెలుస్తుంది కనుక ప్రభాస్ తో సినిమా కు ఇంకా సమయం ఉంది.

కనుక ఈ గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా ను పూర్తి చేసి వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని దర్శకుడు సందీప్ వంగా భావిస్తున్నాడు.

కొత్త దర్శకులతో సినిమా చేయాలని మెగాస్టార్ చిరంజీవి ఈ దర్శకుడు చెప్పిన కథ కు ఫిదా అయి వెంటనే నటించేందుకు ఓకే చెప్పాడట.

అందుకే ప్రభాస్ తో కంటే ముందు మెగాస్టార్ తో సినిమా ను చేసేందుకు సందీప్ వంగ రెడీ అయ్యాడు అనే ప్రచారం జరుగుతుంది.

వైరల్ వీడియో: ఒంటి చేత్తో 90 లక్షల విలువైన క్యాచ్ ను పట్టుకున్న వీక్షకుడు