ప్రభాస్ కు ఇది అతి పెద్ద బ్యాడ్‌ న్యూస్‌.. 2022 కి ఇంతే

బాహుబలి సినిమా తో పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన ప్రభాస్ సాహో సినిమాతో తన స్టార్‌ డమ్ ను మరింతగా పెంచుతున్నాడు.

దాంతో తాజాగా విడుదలైన రాధేశ్యామ్‌ అక్కడ భారీ క్రేజ్ ను దక్కించుకుంది.కాని సినిమా అక్కడ ప్లాప్ అయ్యింది.

అయినా కూడా ఏ మాత్రం ఆయన ఇమేజ్ డ్యామేజ్ కాలేదు అనడంలో సందేహం లేదు.

ఇప్పటికి కూడా ఉత్తరాది అభిమానులు ప్రభాస్ కొత్త సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రాధేశ్యామ్‌ విషయంలో వారు నిరుత్సాహంతో ఉన్నప్పటికీ ప్రభాస్ కొత్త సినిమాల విషయంలో చాలా ఆసక్తిగా ఉన్నారు అనే వార్తలు వస్తున్నాయి.

"""/" / ఈ సమయంలో ప్రభాస్‌ నుండి రాబోతున్న కొత్త సినిమాల గురించి ఆసక్తికర చర్చ జరుగుతుంది.

ఈ ఏడాదిలో ప్రభాస్ నటించిన మరో సినిమా కూడా విడుదల అవుతుందని నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చాయి.

అది మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజా డీలక్స్ లేదా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా అయ్యి ఉండవచ్చు అంటూ ప్రతి ఒక్కరు అనుకున్నారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2022 సంవత్సరంలో ప్రభాస్ నుండి మరో సినిమా రాకపోవచ్చు తెలుస్తోంది.

2022 లో ఆయన నుండి వచ్చిన రాధేశ్యామ్ తప్ప మరోటి రాక పోవచ్చు అనే వార్త ఆయన అభిమానులకు నిరాశ కలిగిస్తున్నాయి.

కాని 2023 సంవత్సరం లో మాత్రం కచ్చితంగా ఆయన నుండి రెండు లేదా మూడు సినిమాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

 ప్రభాస్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ప్రాజెక్టు కె సినిమా కోసం ఎదురు చూసిన విషయం తెలిసిందే.

ఆ సినిమా విడుదలకు 2024 వరకు వెయిట్ చేయాల్సి రావచ్చు అని అనిపిస్తుంది.

మొత్తానికి ప్రభాస్ నుండి భారీ సినిమాలు వస్తున్నాయి.

హర్ష సాయి మరో సంచలన ఆడియో.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను సమర్ధించుకుంటున్న హర్ష?