మరో కన్నడ దర్శకుడికి ఓకే చెప్పిన ప్రభాస్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) హీరో గా వరుసగా సినిమాలు రాబోతున్నాయి.
మొన్ననే ఆదిపురుష్ ( Adipurush ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ సినిమా ఫలితం తో సంబంధం లేకుండా ప్రభాస్ తదుపరి సినిమా సలార్ ( Salaar )భారీ అంచనాల నడుమ రూపొందుతోంది.
అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా సలార్ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ సినిమా మాత్రమే కాకుండా ప్రభాస్ ప్రాజెక్ట్ కే స్పిరిట్ మరియు మారుతి దర్శకత్వం లో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.
ఇన్ని సినిమాలు చేస్తున్న ప్రభాస్ తాజాగా ఒక కన్నడ సినిమా దర్శకుడికి ఓకే చెప్పాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
"""/" /
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కన్నడ సినీ దర్శకుడు చెప్పిన కథ ప్రభాస్ కి నచ్చడం తో వెంటనే చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ ఇండస్ట్రీ కి చెందిన కొందరు మాట్లాడుకుంటున్నారు.
2024 సంవత్సరంలో ప్రభాస్ మరియు ఆ కన్నడ దర్శకుడు సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
అప్పటి వరకు సలార్, ప్రాజెక్టు కే, మారుతి సినిమాలు షూటింగ్ పూర్తి అవుతాయి.
"""/" / కనుక ప్రభాస్ పూర్తిగా కన్నడ సినిమా దర్శకుడు కోసం సమయం కేటాయించే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
మొత్తానికి ప్రభాస్ జోరు చూస్తూ ఉంటే అభిమానులకు ముచ్చటేస్తోంది.ఒకప్పుడు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయని ప్రభాస్ ఇప్పుడు ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు చేస్తాను అంటూ ప్రకటించడంతో పాటు ఆ విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేయడం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా చివరి దశ షూటింగ్ జరుగుతోంది.సెప్టెంబర్ నెలలో ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.
సలార్ సినిమా కి కూడా దర్శకుడు కన్నడ దర్శకుడు అనే విషయం అందరికి తెలిసిందే.
తర్వాత చేసే సినిమాల మీద లైట్ తీసుకుంటున్న అల్లు అర్జున్…