ప్రాజెక్ట్ కే రెండు భాగాలు… అసలు విషయం ఏంటి అశ్విన్ బాబు!
TeluguStop.com
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ( Prabhas )హీరోగా నాగ్ అశ్విన్ ( Nag Ashwin )రూపొందిస్తున్న ప్రాజెక్ట్ 'కల్కి 2898 ఏడీ' సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
ఇది ఒక తెలుగు సినిమా లేదా సౌత్ ఇండియా సినిమా లేదా బాలీవుడ్ సినిమా అన్నట్లుగా కాకుండా పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగా యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల విడుదల అయిన గ్లిమ్స్ ను చూస్తూ ఉంటే సినిమా కచ్చితంగా పాన్ వరల్డ్ మూవీ అన్నట్లుగానే అనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. """/" / మొన్నటి వరకు 2024 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని అన్నారు.
కానీ సినిమా విడుదల తేదీ లో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి.2024 సమ్మర్ కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా ను రెండు భాగాలుగా విడుదల చేసే ఉద్దేశ్యంతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.
ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా( Salaar Movie )రెండు భాగాలు గా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.
దాంతో ఈ సినిమా విషయం లో కూడా ఆసక్తి నెలకొంది. """/" / ఒక వేళ కల్కి రెండు భాగా లు గా విడుదల అయితే రెండవ భాగం విడుదల ఎప్పుడు ఉంటుందా అంటూ ఇప్పటి నుండే చర్చ మొదలు అయింది.
ఇటీవలే సలార్ సినిమా ను రెండు ఛాప్టర్స్ గా విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అధికారికంగా ప్రకటించాడు.
కానీ ప్రాజెక్ట్ కే అయిన కల్కి 2898 ఏడీ సినిమా రెండు భాగాలుగా వస్తుందా లేదంటే సింగిల్ భాగంగానే వస్తుందా అనే విషయాన్ని తెలియజేయడానికి దర్శకుడు నాగ్ అశ్విన్ ముందుకు రావడం లేదు.
ముందు ముందు అయినా నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని క్లీయర్ చేస్తాడేమో చూడాలి.
ఒక వేళ రెండు భాగాలు అయితే ఇప్పటికే ఆ పనులు మొదలు పెట్టాల్సి ఉంది.
మరి నాగ్ అశ్విన్ ఆ పని మొదలు పెట్టాడా అనేది తెలియాల్సి ఉంది.
రెండు భాగాలుగా సినిమా విడుదల అయితే ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయి.
కనుక నాగ్ అశ్విన్ ఆచితూచి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ఆ హీరో రూపాయి కూడా తీసుకోలేదు.. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి: దిల్ రాజు