Prabhas : ప్రభాస్ అంటేనే ప్రయోగాలు.. ఒక్కో దర్శకుడు ..ఒక్కో రకమైన జోనర్

ప్రభాస్( Prabhas ) అంటేనే ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయాడు.

నటుడు అన్నాక ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉండాలి.అలాంటి నటుడితో దర్శకులు కూడా రకరకాల ప్రయోగాలు చేసి అతనిలోని నటుడిని మరింత పెంచుతారు.

అలాంటి పరిస్థితి ప్రస్తుతం ప్రభాస్ కి కూడా ఉంది.బాహుబలి సినిమా( Baahubali Movie ) విజయవంతం సాధించిన తర్వాత అతడు చేస్తున్న సినిమాలు ఒక్కొక్కటి ఒక్కో జోనర్లలో తెరకెక్కుతున్నాయి.

ఇవన్నీ కూడా ఒక దానితో మరొకదానికి సంబంధం లేకుండానే సినిమాలను తీస్తున్నాడు ప్రభాస్.

ప్రస్తుతం ప్రభాస్ తో దర్శకులు అలా స్పెషల్ జోనర్స్ లో సినిమాలు తీయడానికి ఇష్టపడుతున్నారు.

ఒకేసారి నాలుగైదు సినిమాలకు కమిట్ అయినా కూడా ప్రభాస్ ఒకదానితో మరొకదానికి సంబంధం లేకుండా జాగ్రత్త పడుతున్నాడు.

"""/" / గత ఏడాది తెరకెక్కిన సినిమాలలో ఆది పురుష్( Adi Purush ) పూర్తిగా డివోషనల్ చిత్రం కాగా, సలార్( Salar ) మాస్ ఎలిమెంట్స్ తో కూడుకొని ఉన్న చిత్రం.

ఇక రాదే శ్యామ్ ఒక ప్రేమ కథ చిత్రం కాగా, అంతకన్నా ముందు తీసిన సాహో పూర్తి యాక్షన్ చిత్రం.

ఈ నాలుగు చిత్రాలు దేనికదే చాలా విభిన్నంగా తెరకెక్కాయి.ప్రస్తుతం ప్రభాస్ కల్కి తో పాటు రాజాసాబ్ అనే రెండు చిత్రాలు షూటింగ్ చేస్తూ ఉన్నాడు.

ఇందులో కల్కి ,నాగ్ అశ్విన్( Kalki, Nag Ashwin ) దర్శకత్వంలో తెరకెక్కుతుండగా ఇది సైన్స్ ఫిక్షన్ మరియు టైం ట్రావెల్ తో కూడుకున్న చిత్రం కాగా, మారుతీ దర్శకత్వంలో వస్తున్న రాజా సాబ్( Raja Saab ) పూర్తిగా కామెడీ భరితంగా ఉండబోతుంది.

"""/" / అయితే ఈ రెండు చిత్రాలే కాకుండా సలార్ సీక్వెల్ లో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.

ఇది కూడా పూర్తి మాస్ చిత్రంగా ఉండబోతుంది.ఇక సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో యాంగ్రీ నేచర్ ఉన్న పాత్రలో మరొక సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కోసం కూడా ఒక సినిమాను చేయబోతున్నట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతుంది.

సీతారామం వంటి ఒక అద్భుతమైన క్లాసిక్ సినిమా తీసిన హను రాఘవపూడి ప్రభాస్ తో ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.

1940 లలో రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో జరిగిన కొన్ని సంఘటనల తో కూడిన సినిమాగా ఈ చిత్రం ఉండబోతుందట.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్5 కుబేరుల జాబితా ఇదే.. ఈ లిస్ట్ లో అమితాబ్ స్థానం ఏంటంటే?