డార్లింగ్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్.. 8 నెలల్లోనే మూడు మూవీస్ రిలీజ్!
TeluguStop.com
బాహుబలి సిరీస్ భారీ విజయంతో ప్రభాస్ పేరు మారుమోగి పోయింది.యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాస్త పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ ఒక్క సినిమా ప్రభాస్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది అనే చెప్పాలి.
అప్పటి వరకు డార్లింగ్ అంటే కేవలం సౌత్ వారికీ మాత్రమే పరిచయం.కానీ ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో గ్లోబల్ వైడ్ గా పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పాన్ ఇండియన్ సినిమాలను లైన్లో పెడుతూ తన మార్కెట్ ను పెంచుకుంటున్నాడు.
వరుస షూటింగులతో ఏ మాత్రం విశ్రాంతి లేకుండా గడుపుతున్న డార్లింగ్ త్వరలోనే కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
"""/" /
మరి ప్రభాస్ సినిమాల్లో ముందుగా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న సినిమా ''ఆదిపురుష్''.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా భారీ స్థాయిలో తెరకెక్కింది.
రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 16న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడి జూన్ 16 న ఫిక్స్ అయ్యింది.
"""/" /
ఇక డార్లింగ్ నుండి రాబోతున్న మరో సినిమా సలార్.ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.
అలాగే ప్రభాస్ నుండి రాబోతున్న మూడవ సినిమా ప్రాజెక్ట్ కే.నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ వంటి భారీ తారాగణం ఇందులో భాగం అయ్యారు.
ప్రాజెక్ట్ కే సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న 2024లో రిలీజ్ చేయనున్నట్టు డేట్ లాక్ చేసారు.
ఇలా ప్రభాస్ ఏకంగా 8 నెలల వ్యవధిలోనే మూడు సినిమాలతో ట్రిపుల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఎన్టీయార్ చేస్తున్న డ్రాగన్ సినిమా పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేస్తుందా..?