బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?
TeluguStop.com
టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్య తన సినిమా అఖండ సీక్వెల్(Akhanda Sequel) ను ఈ ఏడాది సెప్టెంబర్ నెల 25న దసరా పండుగ(Dussehra Festival) కానుకగా రిలీజ్ చేయనున్నారు.
ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా బ్లాక్ బస్టర్ హిట్ అనే అభిప్రాయం సినీ అభిమానులలో ఉంది.
ప్రస్తుతానికి ఈ సినిమాకు పోటీగా మరే సినిమా లేదు.అయితే ప్రభాస్ ది రాజాసాబ్ (Prabhas ,the Rajasaab)దసరా రేసులో నిలిచే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.
స్టార్ హీరో ప్రభాస్(Prabhas) నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఈ మధ్య కాలంలో వాయిదా పడ్డాయి.
ది రాజాసాబ్ (The Raja Saab)సైతం అందుకు మినహాయింపు కాదు.వాస్తవానికి ఏప్రిల్ నెల 10వ తేదీన ది రాజాసాబ్ మూవీ థియేటర్లలో రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే వేర్వేరు కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమా ఆ సమయానికి థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు.
"""/" /
సమ్మర్ సీజన్ తర్వాత పెద్ద సినిమాలకు దసరా బెస్ట్ ఆప్షన్, బెస్ట్ సీజన్ అవుతుంది.
అందువల్ల ది రాజాసాబ్ మేకర్స్ ఈ డేట్ ను ఫిక్స్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
ప్రభాస్ సినిమాలకు సోలో రిలీజ్ డేట్ దక్కినా కలెక్షన్ల విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు.
బాలయ్య క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ (Balayya Craze, Fan Following, Popularity)అంతకంతకూ పెంచుకుంటున్నారు.
"""/" /
బాలయ్య, ప్రభాస్ (Balayya, Prabhas)మధ్య హీరోలుగా మంచి అనుబంధం ఉంది.
ఈ ఇద్దరు హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఒకింత సంచలనం అవుతుంది.
అయితే ప్రభాస్ ఈ ఏడాది కన్నప్ప సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ప్రభాస్ హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా మాత్రం వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేయాలంటే ఈ జ్యూస్ తాగండి..!