యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ( Prashanth Neel )దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సలార్.
( Salaar ) ఈ సినిమా టీజర్ ని నేటి తెల్లవారుజామున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
సాధారణంగా అయితే సినిమా టీజర్ లేదా ట్రైలర్స్ లను సాయంత్రం సమయంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
కానీ ఈ సినిమా టీజర్ తెల్లవారు జామున తీసుకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఆ విషయం పక్కన పెడితే గత కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారానికి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఒక ఫుల్ స్టాప్ పెట్టినట్లుగా క్లారిటీ ఇచ్చాడు.
ఈ సినిమా రెండు పార్ట్ లుగా రాబోతుందని ప్రకటించేశాడు.పార్ట్ వన్ సీజ్ ఫైర్ సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
"""/" /
సూపర్ స్టార్ ప్రభాస్ తో పాటు ఈ సినిమా లో మలయాళం సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్( Prithviraj Sukumaran ) ఫ్యామిలీ స్టార్ జగపతి బాబు హీరోయిన్ గా శృతి హాసన్ నటించగా.
బాలీవుడ్ మరియు కన్నడ సినిమా పరిశ్రమ కు చెందిన ఎంతో మంది స్టార్స్ కనిపించబోతున్నారు.
రెండు పార్ట్ లుగా రావడం అనేది అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.ప్రశాంత్ నీల్ గత చిత్రం కేజీఎఫ్ రెండు పార్ట్ లుగా వచ్చి సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
ముఖ్యంగా రెండవ భాగం రూ.1000 కోట్ల కు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది.
"""/" / అందుకే ప్రభాస్ కూడా రెండు పార్ట్ లకు ఓకే చెప్పి ఉంటాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి సలార్ సినిమా పూర్తి అయిన వెంటనే ఎన్టీఆర్ సినిమా ను మొదలు పెడతాడు అనుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ సినిమా తోనే మరో రెండు సంవత్సరాల పాటు కుస్తీ పట్టబోతున్నాడు.
అంటే ప్రభాస్ సినిమా పూర్తి అయిన తర్వాతే ఎన్టీఆర్ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదలు పెట్టబోతున్నాడు.
సెప్టెంబర్ 28వ తారీఖున సలార్ మొదటి భాగం సంచలనం సృష్టించడం ఖాయం అంటూ అభిమానులు టీజర్ చూసిన తర్వాత నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు.
భర్తతో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసిన సోనాక్షి సిన్హా.. ఈ కారు ఖరీదెంతో తెలుసా?