ప్రభాస్ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం ఆ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారా.. ఏమైందంటే?

స్టార్ హీరో ప్రభాస్ స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి( Hanu Raghavapudi ) కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండగా ఈ సినిమా రిలీజ్ కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.

ప్రభాస్ మూవీ ఓవర్సీస్ హక్కుల కోసం ఊహించని స్థాయిలో డిమాండ్ నెలకొందని తెలుస్తోంది.

ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో కోట్ చేస్తున్నారట.

టికెట్ రేట్లు ఎంత పెట్టినా ఈ రేంజ్ లో రికవరీ జరగాలంటే మాత్రం ఏ స్థాయిలో కలెక్షన్లు రావాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఎంత ప్రభాస్ మూవీ( Prabhas Movie ) అయినా ఓవర్సీస్ బయ్యర్లు ఈ రేంజ్ లో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడే అవకాశాలు అయితే తక్కువగానే ఉంటాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

ప్రభాస్ హను కాంబో మూవీ బిజినెస్ పరంగానే సంచలనాలు సృష్టించే ఛాన్స్ అయితే ఉంది.

"""/" / ప్రభాస్ రెమ్యునరేషన్ రేంజ్ లో ఓవర్సీస్ హక్కులు ఉండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ సైతం ఈ సినిమా విషయంలో పూర్తిస్థాయిలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారని సమాచారం అందుతోంది.

మైత్రీ నిర్మాతలకు ఈ సినిమాతో భారీ లాభాలు పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ రేంజ్ మాత్రం సినిమా సినిమాకు పెరుగుతోంది. """/" / స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి సక్సెస్ రేట్ తక్కువనే సంగతి తెలిసిందే.

అయినప్పటికీ ఆయన టాలెంట్ ను నమ్మి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారు.అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ లో ప్రభాస్ పాల్గొననున్నారు.

ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటుండగా ప్రభాస్ సినిమాలు నిర్మాతలకు కళ్లు చెదిరే లాభాలను అందిస్తున్నాయి.

జగన్ : బీజేపీకి దూరంగా … కూటమికి దగ్గరగా  ?