మారుతి-ప్రభాస్ షూట్ అప్డేట్.. ఇండోర్ లోనే ప్లాన్ చేసిన డైరెక్టర్!

బాహుబలి సినిమాతో ప్రభాస్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.ఈ సినిమా ఇచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ తో ఈయన వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఎవ్వరు చేయనన్ని పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెట్టి అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు.

మేకర్స్ ఈయన క్రేజ్ ను వాడుకుని మరిన్ని సినిమాలు ప్లాన్ చేస్తున్నారు.మరి ఈ క్రమంలోనే ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కూడా సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే ఆగష్టు 25న ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ఎటువంటి హంగామా లేకుండానే స్టార్ట్ చేసారు.

'రాజా డీలక్స్' అనే టైటిల్ ను కూడా మారుతి ఫిక్స్ చేసాడని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ కొనసాగించ బోతున్నారు.

ఇక ఈ సినిమా గురించి లేటెస్ట్ గా ఒక సమాచారం బయటకు వచ్చింది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఈ నెలలోనే స్టార్ట్ కాబోతుంది అని.స్టార్ట్ చేసిన తర్వాత కొద్దీ రోజుల పాటు ఇండోర్ లోనే షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

ఇక పక్కా కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కబోయే ఈ సినిమాను ప్రభాస్ ఇమేజ్ కు ఏ మాత్రం తీసిపోకుండా మారుతి స్క్రిప్ట్ రెడీ చేసారని మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి చేయబోతున్నట్టు తెలుస్తుంది.

"""/" / ఇక ఈ పాన్ ఇండియా మూవీలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ తో పాటు నిధి అగర్వాల్ కూడా నటించ బోతున్నట్టు సమాచారం.

ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ లోపు ప్రభాస్ 2023 జనవరిలో ఆదిపురుష్ సినిమాతో రాబోతున్నాడు.

అలాగే ఈయన నటించే సలార్, ప్రాజెక్ట్ కే కూడా వచ్చే ఏడాది కానీ 2024లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమాను పీపుల్ ఫ్యాక్టరీ బ్యానర్ పై టి జి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.

కొరటాల శివ ఆ స్టార్ హీరో తో సినిమా చేస్తున్నాడా..?