మారుతికి కండిషన్ పెట్టిన ప్రభాస్.. అందుకే షూట్ విషయం చెప్పడం లేదట!
TeluguStop.com
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ ఆ తర్వాత మాత్రం వెనుకబడి పోతున్నాడు.
బాహుబలి తర్వాత వచ్చిన రెండు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి.ఎంతో హైప్ తో రిలీజ్ అవ్వడం.
ఆ తర్వాత ప్లాప్ అవ్వడం.ఇదే జరుగుతూ వస్తుంది.
వరుసగా పాన్ ఇండియా సినిమాలు అయితే కమిట్ అవుతున్నాడు.కానీ సక్సెస్ అనేది ప్రభాస్ చెంతకు చేరడం లేదు.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.సాహో, రాధేశ్యామ్ అట్టర్ ప్లాప్ అయ్యాయి.
ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి ఆదిపురుష్ రాబోతుంది.ఈ సినిమాపై మొన్నటి వరకు అంచనాలు పీక్స్ లో ఉండేవి.
కానీ ప్రభాస్ అదృష్టం ఏంటో కానీ ఈ సినిమా విషయంలో కూడా ట్రోల్స్ రావడంతో అంచనాలు తగ్గాయి అనే చెప్పాలి.
దీంతో ఫ్యాన్స్ ఏం జరుగుతుందో అర్ధం కాక తలలు పట్టుకుంటున్నారు.ఇదిలా ఉండగా ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తూనే మారుతితో కూడా కమిట్ అయ్యాడు.
ఈయనతో సినిమా చేయడం ఇప్పుడు అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.రొటీన్ కథలను తెరకెక్కించే ఈ డైరెక్టర్ తో సినిమా చేయడం అంటే రిస్క్ అంటున్నారు.
ఇలా ఉండగానే సైలెంట్ గా షూట్ కూడా స్టార్ట్ చేసి మరింత షాక్ ఇస్తున్నాడు ప్రభాస్.
అయితే ప్రభాస్ మారుతికి ఒక కండిషన్ పెట్టారట.మొదటి షెడ్యూల్ స్టార్ట్ చేసి ఇప్పటికే మూడు రోజుల షూట్ కూడా పూర్తి అయినట్టు టాక్.
ప్రభాస్ షూట్ పూర్తి అవ్వడంతో మిగతా నటీనటులతో షూటింగ్ మరో నాలుగు రోజుల పాటు జరగనుందట.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం ముందుగానే భారీ సెట్స్ నిర్మించడం.అలాగే మారుతికి అడ్వాన్స్ ఇవ్వడం వల్లనే సినిమా షూట్ తప్పక స్టార్ట్ చేశారట.
"""/"/
ఎలాగూ ఇన్వెస్ట్ చేసాం కాబట్టి తొలి షెడ్యూల్ బాగా వచ్చిందో రాలేదో చూసుకుని అప్పుడు ఒక నిర్ణయానికి వద్దాం అని ప్రభాస్ తో పాటు టీమ్ డిసైడ్ అయ్యిందట.
అందుకే ఎలాంటి హంగామా లేకుండానే షూట్ స్టార్ట్ చేశారట.వీరు పెట్టిన కండిషన్ ప్రకారం ఫస్ట్ షెడ్యూల్ ఎలా వచ్చింది అనే దాని మీద ఈ ప్రాజెక్ట్ పూర్తి అవ్వడమా లేదంటే ఆపేయడమా అనేది తెలుస్తుంది.
కొంత మారుతి మీద నమ్మకంగానే ఉన్నారట.మరి ఇది పూర్తి అయ్యేది లేనిది త్వరలోనే తెలుస్తుంది.
వీడియో వైరల్.. క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ.. ఎందుకంటే?