Prabhas : ప్రభాస్ కి ఆ సినిమా అంటే చాలా ఇష్టమట కానీ అది డిజాస్టర్ అయ్యింది…

కృష్ణంరాజు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్( Prabhas ) మొదటి రెండు సినిమాలతో ఓకే అనిపించుకున్నప్పటికీ, మూడోవ సినిమాగా చేసిన వర్షం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇక దానికి తోడుగా ఆయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ వస్తుంది.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కెరియర్ లో తన ఇమేజ్ ను పక్కన పెట్టి చేసిన ఒక ఎక్స్పరిమెంటల్ సినిమా అంటే ఆయనకి చాలా ఇష్టమట.

కానీ ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాలేదని ప్రభాస్ చాలాసార్లు చెప్పాడు అది ఏ సినిమా అంటే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'చక్రం ' ( Chakrem )సినిమా.

"""/" / ఇక మనిషి ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు కాబట్టి బతికినన్ని రోజులు సంతోషంగా బతకాలి అనే ఒక చిన్న మెసేజ్ తో ఈ సినిమా ఉండటం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ మరణించడం అనేది అతని అభిమానులు జీవించుకోలేకపోయారు.కానీ ఈ స్టోరీ బాగుండడంతో ప్రభాస్ ఈ సినిమాని చేశాడు.

ఇప్పటికీ ప్రభాస్ కి నచ్చిన సినిమాల్లో చక్రం సినిమా కూడా ఒకటని ఆయన చాలా సందర్భాల్లో తెలియజేశారు.

"""/" / ఇక ఈ సినిమాలో ప్రభాస్ నటించిన నటన కూడా చాలా కొత్తగా ఉంటుంది.

అందువల్లే ఈ సినిమా ప్రభాస్ ని నటుడుగా మరొక మెట్టు పైకి ఎక్కించ్చిందనే చెప్పాలి.

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా నటుడిగా మాత్రం ప్రభాస్ ని ఇంకొక యాంగిల్ లో చూపించిన సినిమా అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా ప్రభాస్ ఆల్ టైం ఫేవరెట్ సినిమాల్లో ఒకటి కావడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా అంటే కృష్ణవంశీ కి కూడా చాలా ఇష్టమట.

ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న దెయ్యాల ఆటో.. వీడియో చూస్తే గుండెలు అదిరిపోతాయి!