నాగ్ అశ్విన్ కి చిరాకు తెప్పిస్తున్న ప్రభాస్ గందరగోళ నిర్ణయాలు
TeluguStop.com
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) హీరోగా ప్రస్తుతం నాగ్ అశ్విన్( Nag Ashwin ) దర్శకత్వం లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే 'కల్కి 2898 ఏడీ'( Kalki 2898AD ) షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది.
ఇప్పటికే సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాను వాయిదా వేసినట్లుగానే అనిపిస్తుంది.సంక్రాంతికి విడుదల చేయబోతున్నామని ఈ మధ్య కాలంలో యూనిట్ మెంబర్స్ చెప్పడం లేదు.
మొన్న విడుదల అయిన గ్లిమ్స్ లో కూడా సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వలేదు.
ఈ ఆలస్యం కు కారణం ప్రభాస్ అనే అభిప్రాయం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మరియు దీపికా పదుకునేల యొక్క డేట్లు కలవడం లేదట.
"""/" /
అందుకే షూటింగ్ ఆలస్యం అవుతుందట.తాజాగా మూడు రోజుల షెడ్యూల్ ను ప్లాన్ చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ అంతా పూర్తి అయిన తర్వాత ప్రభాస్ హ్యాండ్ ఇచ్చాడట.
సారీ నాగీ ఈసారికి రాలేను అంటూ వదిలేయమన్నాడట.దాంతో ప్రభాస్ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల షూటింగ్ కి( Kalki 2898AD Shooting ) హాజరు అవ్వలేక పోయాడట.
దాంతో మొత్తం షెడ్యూల్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ క్యాన్సిల్ చేశాడు అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
సినిమా ను సమ్మర్ లో విడుదల చేయాలి అంటే ఈ ఏడాది చివరి వరకు అయినా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది.
"""/" /
కానీ ప్రభాస్ ఇలా డుమ్మా కొడితే ఎలా అంటూ నాగ్ అశ్విన్ తో పాటు నిర్మాణ సంస్థ ప్రతినిథులు అసహనం వ్యక్తం చేస్తున్నారట.
ముందే డేట్ల విషయంలో క్లారిటీగా ఉండకుండా ప్రభాస్ గందరగోళ నిర్ణయాల వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో కల్కి సినిమా కు విపరీతమైన ఆధరణ కనిపిస్తోంది.మినిమం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం.
మెగా హీరోలకు వరుస ఫ్లాపుల వెనుక కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరుగుతోందా?