Prabhas : ఇండియాలో కాకుండా విదేశాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతున్న ప్రభాస్
TeluguStop.com
ప్రభాస్( Prabhas ).బాహుబలి సిరీస్ తర్వాత వరుసగా మూడు డిజాస్టర్ ఫలితాలు అందుకున్నాడు.
అయినా కూడా ఏమాత్రం ఆయన క్రేజ్ తగ్గలేదు అంటే నమ్మండి.ప్రస్తుతం ప్రభాస్ కి పాన్ ఇండియా వ్యాప్తంగా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
అంతే కాదు ఆయన తీస్తున్న ప్రతి సినిమా ద్వారా వందల కోట్ల రూపాయల పారితోషకం కూడా అందుకుంటున్నాడు.
నిజం చెప్పాలంటే బాలీవుడ్( Bollywood ) లో హీరోలను సైతం దాటేసి పోయాడు ప్రభాస్.
ప్రస్తుతం పాన్ ఇండియా వ్యాప్తంగా టాప్ లో ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోల్లో ప్రభాస్ కూడా.
ఒక్కోసారి ఖాన్స్ వంటి హీరోలను కూడా దాటేసి ఆయన తన రెమ్యూనరేషన్ అందుకోవడం విశేషం.
"""/" /
ఇక ప్రభాస్ తన ప్రతి సినిమాకు 100 కోట్లకు పైగానే పారితోషకం పుచ్చుకుంటున్నాడు.
ఇలా వస్తున్న రెమ్యూనరేషన్ తో ఇండియాలో కాకుండా బయట దేశాల్లో పెట్టుబడులు పెడుతూ ఉండడం విశేషం.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుంది.ఎందుకంటే తాజాగా ఇటలీలో చాలా పెద్ద మొత్తంలో ఆస్తులను కొనుగోలు చేశాడట ప్రభాస్.
అక్కడ ఫుడ్ రెస్టారెంట్స్( Food Restaurants ) అలాగే కొన్ని ల్యాండ్స్ పై పెట్టుబడి పెట్టాడట.
వీటి ద్వారా నెల నెల బాగానే ఆదాయం కూడా వస్తోందట.అందువల్ల విదేశాల్లో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త దూకుడుగానే ఉన్నాడట ప్రభాస్.
"""/" /
ఇక తన స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు ఎంజాయ్ చేయడానికి, రిలాక్స్ అవ్వడానికి ఇటీవల కాలంలోనే ఒక పెద్ద విల్లాను సైతం కొనుగోలు చేశాడట.
సినిమా సినిమాకి ఉన్న గ్యాప్ లో ఆ విల్లాలో కొన్ని రోజులపాటు సమయం గడుపుతాడట ప్రభాస్.
ఇలా సూపర్ స్టార్ గా ఎదిగిపోయి వందల కోట్ల రూపాయలను సంపాదిస్తున్న ప్రభాస్ మూడు సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఏమాత్రం అతని క్రేజ్ ని పోగొట్టుకోలేదు.
ఇప్పుడు ప్రస్తుతం మరో మూడు సినిమాలతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.ఈ మూడు సినిమాల ద్వారా మూడు వందల కోట్లు పారితోషకం తీసుకుంటున్న ప్రభాస్ మరి ఇంకా ఎంత మొత్తంలో విదేశాల్లో ఆస్తులను కూడబెడతాడో చూడాలి.
నన్ను అత్తగా సెలెక్ట్ చేసుకున్నందుకు థాంక్యూ.. మంచు లక్ష్మి ఎమోషనల్ పోస్ట్ వైరల్!