లక్ అంటే ప్రభాస్ దే.. మూడు ఫెయిల్యూర్స్ కూడా వారి ఖాతాలోకే!
TeluguStop.com

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి 2 సినిమా( Baahubali 2 ) తర్వాత ఇప్పటి వరకు సరైన సక్సెస్ ను సొంతం చేసుకోలేక పోయాడు.


అంతే కాకుండా ప్రభాస్ ఖాతాలో సాహో.రాధేశ్యామ్ వంటి డిజాస్టర్స్ పడ్డాయి.


ఇక ఆదిపురుష్ సినిమా ఫలితం ఏంటి అనేది ఎవరు కూడా చెప్పలేకుండా ఉన్నారు.
ఆ సినిమా ఫలితం విషయం పక్కన పెడితే దర్శకుడు ఓం రౌత్( Director Om Raut ) తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
ఇలాంటి సినిమా తీశావు ఏంటి అంటూ దర్శకుడు ఓం రౌత్ ను ఇలాంటి డైలాగ్స్ రాశావు ఏంటి అంటూ మాటల రచయితను నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు.
"""/"/ ప్రభాస్ రాముడిగా బాగానే ఉన్నాడు అంటూ కొందరు మాట్లాడుకుంటూ ఉంటే మరి కొందరు మాత్రం రాముడిని అలా చూపించడం ఏమాత్రం బాగాలేదు అంటున్నారు.
మొత్తానికి ఆదిపురుష్( Adipurush ) యొక్క వివాదాలకు కారణం.ఫెయిల్యూర్ కు కారణం పూర్తిగా దర్శకుడు ఓం రౌత్ అన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
సాహో మరియు రాధేశ్యామ్( Saaho And Radhe Shyam ) సినిమాల విషయంలో కూడా అదే జరిగింది.
సాధారణంగా ఏ హీరో అయినా కూడా మూడు డిజాస్టర్స్ పడితే కచ్చితంగా కోలుకోవడం కష్టం.
"""/"/
అలాంటిది ప్రభాస్( Prabhas ) ఏకంగా మూడు అతి పెద్ద డిజాస్టర్స్ పడ్డా కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు అన్నట్లుగా హ్యాపీగానే ఉన్నాడు.
ముందు ముందు ఆయన సినిమా లు వరుసగా బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఈ ఏడాది లోనే సలార్ సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే.ఆ సినిమా కు సంబంధించిన హడావుడి ఏ స్థాయి లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సలార్( Salaar ) మరియు ప్రాజెక్ట్ కే లు అయినా సక్సెస్ అయ్యేనో చూడాలి.
వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కూడా ప్రభాస్ లక్ కారణమో ఏమో కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రతి ఫెయిల్యూర్ యొక్క క్రెడిట్ దర్శకులకే పడింది.కనుక ప్రభాస్ సేఫ్ అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హెన్నా వల్ల పొడిబారిన జుట్టును రిపేర్ చేసే సూపర్ టిప్స్ మీకోసం!