ప్రభాస్ కల్కి కోసం రంగం లోకి దిగిన తెలుగు స్టార్ హీరో…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకున్న నటుడు రానా( Rana ) ఇక ఈయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లీడర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.

అయితే ఈయన చేసిన ప్రతి సినిమాలో వైవిధ్యన్నైతే కనబరుస్తూ నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు.

ఇక బాహుబలి సినిమాతో స్టార్ గా గుర్తింపు అయితే పొందాడు.అయితే ఈ సినిమాలో ప్రభాస్( Prabhas ) హీరో పాత్రను పోషించినప్పటికి రానా కూడా తనతో పాటు గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు.

"""/" / ఎందుకంటే విలనిజాన్ని పండించడంలో అత్యున్నతమైన వైవిధ్యాన్ని ప్రదర్శించాడు.కాబట్టే ఆయన ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడిగా కొనసాగుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా వస్తున్న కల్కి సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలైతే ఉన్నాయి.

అయితే వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే నాగ్ అశ్విన్ ( Nag Ashwin )ఈ సినిమా మీద భారీ ఎఫర్ట్ అయితే పెడుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా రానా కల్కి సినిమాలో వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని తెలుస్తుంది.

దానికి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేసుకున్న రానా ఈ సినిమా గురించి స్పందిస్తూ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనే హింట్ కూడా ఇచ్చాడు.

ఇక దాంతో రానా ఎంట్రీతో కల్కి సినిమా ( Kalki Movie )మరింత గ్రౌండ్ గా మారిందనే చెప్పాలి.

"""/" / కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని నాగశ్విన్ చాలా తీవ్రమైన కసరత్తులను చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

చూడాలి మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడు అనేది.

ఇక రానా కూడా ఈ సినిమాలో భాగమవడం చూసిన ప్రభాస్ అభిమానులు రానాకి కూడా థాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఆయన చెప్పిన మాటల్ని వైరల్ చేస్తున్నారు.

మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!