Prabhas : ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ మాత్రమే.. ఫ్లాప్ సినిమాతో కూడా ప్రభాస్ టాప్ అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్( Prabhas ) ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే.

తన పని తాను చూసుకునే హీరోగా ప్రభాస్ కు పేరు ఉండగా ప్రభాస్ ఖాతాలో ఎన్నో రికార్డులు ఉన్నాయి.

అయితే గతేడాది ట్విట్టర్ ట్రెండ్స్ లో టాప్ 10లో ట్రెండ్ అయిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ కావడం గమనార్హం.

ఈ విషయం తెలిసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరో ప్రభాస్ మాత్రమే అంటూ నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

"""/" / ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా( Adipurush ) కూడా ట్విట్టర్ టాప్ 10లో నిలవడం గమనార్హం.

లియో, జవాన్, పఠాన్, బిగ్ బాస్ షో కూడా టాప్ 10లో నిలిచాయి.

ట్విట్టర్ ట్రెండ్స్ లో ప్రభాస్ ఏడో స్థానంలో ఉండగా ఆదిపురుష్ 10వ స్థానంలో నిలిచింది.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ అరుదైన రికార్డ్ లను ఖాతాలో వేసుకుంటూ అభిమానులను ఒకింత ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారనే చెప్పాలి.

"""/" / ప్రభాస్ ఇప్పటికే కల్కి షూటింగ్ ను పూర్తి చేయగా త్వరలో ది రాజాసాబ్ సినిమా( The Raja Saab ) షూటింగ్ లో పాల్గొనున్నారు.

ఈ సినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసి ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.

ప్రభాస్ హను రాఘవపూడి సినిమాను సైతం త్వరలో మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.ప్రభాస్ స్పీడ్ కు బ్రేకులు వేయడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పారితోషికం పరంగా సైతం ప్రభాస్ టాప్ లో ఉండగా ప్రభాస్ సినిమాలకు జరుగుతున్న బిజినెస్ ను చూసి షాక్ అవ్వడం ఇతర హీరోల వంతవుతోంది.

ప్రభాస్ ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు.ఈ ఏడాది రెండు సినిమాలు రిలీజ్ కానుండగా వచ్చే ఏడాది కూడా రెండు సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లానింగ్ ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025