ఆ జాబితాలో సైతం నంబర్ వన్ స్టార్ హీరోగా ప్రభాస్.. దేశంలోనే నంబర్ వన్ గా నిలిచారుగా!

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.సలార్, కల్కి లాంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకున్నారు ప్రభాస్.

ఇది ఇలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి.

( Kalki ) ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

1000 కోట్లు కలెక్షన్స్ ను సాధించడంతో పాటు రికార్డుల మీద రికార్డులు సృష్టించింది.

ఇక ఈ సినిమాకు ముందు ఈ సినిమా విడుదల సమయంలో ప్రభాస్ ఎన్ని రికార్డులు సాధించారో మనందరికీ తెలిసిందే.

"""/" / తాజాగా కూడా మరో ఘనతను సాధించారు.మరి ఆ వివరాల్లోకి వెళితే.

ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్‌( Ormax ) విడుదల చేసిన మోస్ట్ పాపులర్‌ హీరోల జాబితాలో టాప్‌లో నిలిచారు ప్రభాస్.

తాజాగా ఆర్మాక్స్‌ జూన్‌ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా మోస్ట్‌ పాపులర్‌ స్టార్‌ల జాబితాను విడుదల చేసింది.

ఇందులో ప్రభాస్‌ అగ్రస్థానంలో నిలిచారు.మే నెలలో టాప్‌ వన్‌లో ఉన్న ప్రభాస్ ఉండగా అదే క్రేజ్ ని కొనసాగిస్తూ జూన్‌ లో కూడా అదేవిధంగా మొదటి స్థానంలో నిలిచారు.

కాగా ప్రభాస్ తర్వాత బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌( Shahrukh Khan ) రెండులో నిలిచారు.

"""/" / ఇక ఈ జాబితాలో అల్లు అర్జున్‌,( Allu Arjun ) ఎన్టీఆర్‌లు( NTR ) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

గేమ్‌ ఛేంజర్‌తో రానున్న రామ్‌ చరణ్‌ ఈ లిస్ట్‌లో తొమ్మిదో స్థానంలో నిలిచారు.

మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్‌ ల జాబితాలో అలియా భట్‌ మొదటిలో ఉండగా సమంత, దీపికా పదుకొణె తర్వాతి స్థానాలలో నిలిచారు.

ఈ విధంగా ప్రభాస్ ఒకదాని తర్వాత ఒకటి రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుండడంతో డార్లింగ్ అభిమానులు పుల్ ఖుషి అవ్వడంతో పాటు పండగ చేసుకుంటున్నారు.

ఇన్ని రికార్డులు సాధించడం అన్నది కేవలం మా డార్లింగ్ కి మాత్రమే సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గుంపు మేస్త్రి  రంగుపడుద్ది … రెచ్చిపోయిన బీఆర్ఎస్