ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసుకుని మరీ తిరిగే వార్త ఇది..!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌కు మరో అరుదైన అద్బుతమైన రికార్డు దక్కింది.బాహుబలి చిత్రంతో ఈయనకు వచ్చిన క్రేజ్‌తో అంబానీ ఇంట పెళ్లికి అతిథిగా హాజరు అయ్యే ఛాన్స్‌ వచ్చింది.

సౌత్‌ సినీ పరిశ్రమ నుండి కేవలం ప్రభాస్‌కు మాత్రమే ఆ ఛాన్స్‌ దక్కినట్లుగా ప్రచారం జరుగుతోంది.

బాహుబలి సినిమా ప్రభాస్‌ను ఏ స్థాయికి తీసుకు వెళ్లిందో ఈ విషయం చెప్పకనే చెబుతోంది.

అంబానీ ఇంట పెళ్లికి అతిరథ మహారథులను మాత్రమే ఆహ్వానించారు.తాజాగా ప్రభాస్‌కు అందులో స్థానం దక్కడం అద్బుతంగా చెబుతున్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ప్రభాస్‌ ‘బాహుబలి’ రెండవ పార్ట్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరోల మూవీస్‌ను కూడా కొట్టి పారేసి అద్బుత రికార్డులను దక్కించుకున్న విషయం తెల్సిందే.

ప్రభాస్‌కు బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కూడా ఫిదా అయ్యారు.అందుకే ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేసిందంటూ చెబుతున్నారు.

ఇక అంబానీ కూతురు పెళ్లి వేడుకలో అతిథుల విషయంలో కరణ్‌ జోహార్‌ జోక్యం ఉన్నట్లుగా చెబుతున్నారు.

అందుకే ప్రభాస్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉండే కరణ్‌ మనోడిని ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలుగులో ఎంత మంది స్టార్స్‌ ఉన్నా కూడా అంబానీ ఇంటి నుండి పెళ్లి పిలుపు కేవలం ప్రభాస్‌కు మాత్రమే రావడం అది ఆయన గొప్పదనంగా ఫ్యాన్స్‌ చెప్పుకుంటున్నారు.

ఈ వార్తతో ప్రభాస్‌ ప్యాన్స్‌ గల్లా ఎగరేసుకుని తిరిగేయవచ్చు.ఇక ప్రస్తుతం ‘సాహో’ చిత్రంతో ప్రభాస్‌ చాలా బిజీగా ఉన్నా కూడా అంబానీ ఇంట పెళ్లికి హాజరు అయ్యాడని సమాచారం అందుతోంది.

ప్రభాస్‌కు వచ్చిన అవకాశంతో ఇతర హీరోలు కుళ్లుకుంటూ ఉంటారు కదా.