నేను పాకిస్తానీ అమ్మాయిని కాదు… కళాకారిణి మాదిరిగానే మాత్రమే చూడండి: ఇమాన్వీ

జమ్మూ కశ్మీర్‌లోని (Jammu Kashmir)ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంలో(Pahalgam) ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వెళ్లిన పర్యటకులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే.

ఈ దాడి ఘటనలో భాగంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయారు.ఇలా పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు దాడి చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్(Pakistan) పై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ కి చెందిన నటీనటులు ఎవరైతే ఉన్నారో వారందరూ తిరిగి వెళ్లిపోవాలని వారి సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమాలో పాకిస్తాన్ కి చెందిన నటి ఇమాన్వి(Imanvi) కూడా సినిమా నుంచి తొలగించాలి అంటూ డిమాండ్లు చేస్తున్నారు.

ఇలా ఈమె పాకిస్తాన్ కి చెందిన అమ్మాయి అని తనని సినిమాలలోకి తీసుకోకూడదు అంటూ నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ విషయంపై ఇమాన్వి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు తాను పాకిస్తాన్ కి చెందిన అమ్మాయిని కాదని తాను ఇండో అమెరికన్ అని క్లారిటీ ఇచ్చారు.

అదేవిధంగా ఈ ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. """/" / నేను కానీ నా కుటుంబం కానీ పాకిస్తాన్ సైన్యంతో సంబంధం కలిగి లేరు.

నేను హిందీ, తెలుగు, గుజరాతీ, ఇంగ్లీష్ (Hindi, Telugu, Gujarati, English)మాట్లాడే గర్వించదగిన భారతీయ అమెరికన్‌ని.

నా తల్లిదండ్రులు యుక్త వయసులో చట్టబద్ధంగా యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చిన తర్వాత నేను కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్‌లో జన్మించాను.

అనంతరం వారు అమెరికన్ పౌరులుగా మారారు.అమెరికాలో నా విశ్వవిద్యాలయ విద్యను పూర్తి చేసిన తర్వాత, నేను నటిగా, కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు సాధించాను.

ఈ గుర్తింపు అనంతరం నాకు ఇండియన్ సినిమాలలో ఛాన్స్ రావడం నా అదృష్టమని తెలిపారు.

సినీ ప్రభావం నా జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపించింది అంటూ ఈమె సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేస్తూ తన గురించి వచ్చే వార్తలను పూర్తిగా ఖండించారు.