Prabhas Hanu Raghavapudi : ప్రభాస్ హను రాఘవపూడి కాంబో లో వచ్చే సినిమా స్టోరీ ఇదేనా..?

సలార్ సినిమా( Salaar )తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్, కల్కి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

ఇక ఇప్పుడు ఈయన చేస్తున్న ప్రతి సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి.

ఇలాంటి క్రమంలో ఆయన మరికొన్ని సినిమాలకి కూడా కమిట్ అవుతున్నాడు అందులో ముఖ్యంగా హను రాఘవ పూడి( Hanu Raghavapudi ) దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.

అయితే ఈ సినిమా లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్నప్పటికీ ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తే ఎలా ఉంటుంది అనేది మాత్రం అందరిలో అసక్తి ని నెలకొల్పుతుంది.

ఇక ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాలో లవర్ బాయ్ క్యారెక్టర్ లో ప్రభాస్ ఏ మాత్రం మెప్పించలేకపోయాడు.

కాబట్టి మరోసారి లవ్ స్టోరీ అంటే ప్రభాస్ కు సెట్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

"""/"/ కానీ హను రాఘవపూడి ఇప్పుడు మాత్రం ఈ సినిమాని లవ్ తో పాటు సీతారామం( Sitharamam )లో చూపించినట్టుగా యుద్ధ నేపథ్యంలో సినిమాని నడిపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

ఒకరకంగా ఇది సీతారామం సినిమాకి సీక్వెల్ గా వస్తుంది అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

అయితే సీతారామం కి సీక్వెల్ కాదు గాని, సీతారామం టైపు లోనే ఈ సినిమాని కూడా మరొక యుద్ద వాతావరణాన్ని తీసుకొని అందులో లవ్ స్టోరీ( Love Story ) ని ఎస్టాబ్లిష్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.

"""/"/ హను రాఘవపూడి చెప్పిన కథ కొత్తగా ఉండడంతో ఈ స్టోరీ కి ప్రభాస్( Prabhas ) కనెక్ట్ అయినట్టుగా తెలుస్తుంది.

మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.

ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ అభిమానులు మాత్రం హను రాఘవ పూడి తో సినిమా చేయడం అవసరమా అని వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ ఎలాంటి సక్సెస్ కొడతాడు అనేది.

సూపర్ స్టార్ మహేష్ బాబు బ్యాగ్ ఖరీదెంతో తెలిస్తే మాత్రం కచ్చితంగా షాకవ్వాల్సిందే!