ఆదిపురుష్ టీమ్ కు ఖరీదైన గిఫ్టులు ఇచ్చిన ప్రభాస్.. ఈసారి ఏం సర్ప్రైజ్ అంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెట్ లో అడుగు పెట్టాడంటే ఇక ఆ సెట్ లో ఉన్న వారికీ పండగే.

తన ఎనర్జీ తో సెట్ మొత్తం సందడి చేయడమే కాకుండా తన ఇంటి నుండి భోజనం తెప్పించి మరి సెట్ లో వారికీ సర్ప్రైజ్ ఇస్తూ ఉండడం డార్లింగ్ అలవాటు.

ఇప్పటికే తనతో కలిసి పని చేసిన చాలా మందికి తన ఇంటి ఫుడ్ రుచి చూపించాడు.

ఇప్పటికే ప్రభాస్ తో కలిసి పని చేసిన కో స్టార్స్ అందరు ఈయన తెచ్చే ఫుడ్ గురించి చెబుతూ ఉంటారు.

బాహుబలి, సాహో సినిమాలు చేస్తున్న సమయంలో భారీ విందులు ఏర్పాటు చేసి అందరినిసర్ప్రైజ్ చేసాడు.

ఈ మధ్యనే ప్రాజెక్ట్ కే సినిమా సెట్స్ లో తన కో స్టార్ అయినా దీపికా పదుకొనే కు కూడా అదిరిపోయే ఐటమ్స్ తో మంచి విందు భోజనం తినిపించాడు.

ఇలా ప్రభాస్ పని చేస్తున్న ప్రతి సినిమా షూటింగ్ సమయంలో ఏదొక సర్ప్రైజ్ ఇవ్వడం డార్లింగ్ కు అలవాటే.

మరి తాజాగా మరొకసారి డార్లింగ్ ఆదిపురుష్ సినిమా కో స్టార్స్ కు అదిరిపోయే గిఫ్ట్ లతో సర్ప్రైజ్ చేసినట్టు తెలుస్తుంది.

"""/" / ఈ విషయాన్నీ స్వయంగా ఆ చిత్ర యూనిట్ సభ్యుడు సోషల్ మీడియా ద్వారా చెప్పడంతో బయటకు వచ్చింది.

ఆదిపురుష్ బృందానికి ప్రభాస్ ఖరీదైన వాచ్ లను గిఫ్ట్ గా ఇచ్చి తన టీమ్ మెంబర్స్ ను సర్ప్రైజ్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

"""/" / ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఆదిపురుష్' ఒకటి.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఓం రౌత్ విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడి పాత్రలో, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటిస్తున్నాడు.

ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్ ఈ చిత్ర యూనిట్ సభ్యులకు ఖరీదైన ర్యాడో రిస్ట్ వాచ్ లను గిఫ్ట్ గా ఇచ్చాడు.

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆయనను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

మా గర్ల్ ఫ్రెండ్స్ ను ఇలాగే ఆట పట్టించేవాళ్లం.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ వైరల్!