Prabhas : నటన నేర్పిన గురువుకి ఖరీదైన బహుమతి ఇచ్చిన ప్రభాస్..ఏంటో తెలుసా..?
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్ సినిమా ( Salaar Movie ) రిలీజ్ బిజీ లో ఉన్నారు.
అయితే తాజాగా తనకు నటన నేర్పిన గురువుకి ఒక ఖరీదైన బహుమతి స్వయంగా తీసుకొచ్చి ఇచ్చారు.
మరి ఇంతకీ ప్రభాస్ తన గురువుకి ఇచ్చిన ఆ కాస్ట్లీ గిఫ్ట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.
చదువు నేర్పడమే కాదు ఏ పని నేర్పినా కూడా నేర్పిన వాళ్ళు నేర్చుకున్న వారికి గురువులే అవుతారు.
అలా సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులకు నటన నేర్పి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు సత్యానంద్.
ఈయన దగ్గర నటన నేర్చుకుంటే కచ్చితంగా స్టార్ హీరో అవుతారు అనే పేరు ఉంది.
అలా చిరంజీవి ( Chiranjeevi ) నుండి ఇప్పటి యంగ్ హీరోల వరకు చాలామంది ఆయన దగ్గర నటన నేర్చుకున్న వారే.
"""/" /
అలా కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ సత్యానంద్ ( Sathyanandh ) దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నారట.
అలా ఈయన మొదట ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా మారిపోయారు.
ఇక ఈయన రేంజ్ ఒక్క సినిమాకి దాదాపు 150 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే వరకు ఎదిగింది.
అయితే అలాంటి ప్రభాస్ ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా తనకి యాక్టింగ్ నేర్పించిన గురువుని మాత్రం మర్చిపోలేదు.
"""/" /
తాజాగా తన గురువు అయినటువంటి సత్యానంద్ పుట్టినరోజు నాడు స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి విష్ చేసి మరీ పూర్తిగా బంగారంతో తయారు చేయించిన ఒక ఖరీదైన చేతి వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చారు.
ఇక ఆ ఖరీదైన వాచ్ ని తన చేతులతో తానే తన గురువుకి పెట్టి వాచ్ బాగుందా గురువుగారు అని ఆప్యాయంగా పలకరించారట.
ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) తన గురువు సత్యానంద్ కి వాచ్ గిఫ్ట్ గా ఇచ్చి ఆయన చేతికి పెడుతున్న ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
అల్లు అర్జున్ బోయపాటి కాంబోలో సినిమా రానుందా..? ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది…