రాజు ఎక్కడున్నా రాజే.. వయనాడ్‌ బాధితులకు భారీ విరాళం ఇచ్చిన ప్రభాస్..

టాలీవుడ్ రెబల్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన డార్లింగ్ హీరో ప్రభాస్( Darling Hero Prabhas ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా హీరో ప్రభాస్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు.ఆ తర్వాత వచ్చిన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందాడు.

డార్లింగ్ హీరో ప్రభాస్ తాజాగా కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ లో( Wayanad ) జరిగిన వరద బీభత్సం కారణంగా.

ఈ ప్రమాదంలో 400 మంది పైగా మరణించారు.వందల మంది గల్లంతయ్యారు.

ఈ నేపథ్యంలో వారందరినీ ఆదుకునేందుకు చాలామంది ప్రముఖులు ముఖ్యంగా సినీ తారలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇదివరకే టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుండి అల్లు అర్జున్, చిరంజీవి కుటుంబ సభ్యులు విరాళాన్ని ప్రకటించారు.

తాజాగా ఈ లిస్టులో డార్లింగ్ ప్రభాస్ చేరాడు. """/" / ఇదివరకు వరద బాధితుల కోసం హీరో అల్లు అర్జున్ 25 లక్షల రూపాయల విరాళం ప్రకటించగా.

చిరంజీవి - రామ్ చరణ్ కలిపి కోటి రూపాయలను భక్తులకు విరాళంగా ప్రకటించారు.

ఇక తాజాగా గ్లోబల్ స్టార్ హీరో ప్రభాస్ ఏకంగా రెండు కోట్ల( Two Crores ) రూపాయల్ని కేరళ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించారు.

దీంతో హీరో ప్రభాస్ ను కేవలం రియల్ హీరో మాత్రమే కాదు.రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

"""/" / కేవలం టాలీవుడ్ తారల మాత్రమే కాకుండా.దక్షిణాది సినీ పరిశ్రమల నుండి హీరో హీరోయిన్లు సూర్య, జ్యోతిక, రష్మిక, నయనతార, ఫాజిల్ లు భారీ విరాళాన్ని ప్రకటించారు.

ఈ నేపథ్యంలో మరికొంతమంది వరద బాధితులకు సహాయం చేయడానికి అతి త్వరలో ముందుకు రాబోతున్నట్లు సమాచారం.

డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర చేసిన పాకిస్థానీ అరెస్ట్..