ప్రభాస్ మాస్టర్ ప్లాన్.. ‘ఆదిపురుష్’ తర్వాతే మిగిలినవి అట!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ( Adipurush ) హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ ( Kriti Sanon ) కథానాయికగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ( Director Om Raut ) తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ''ఆదిపురుష్''( Adipurush ).

ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాపై ముందు నుండి భారీ అంచనాలు పెరిగాయి.

ప్రభాస్ నటిస్తున్న మొదటి హిందీ సినిమా కావడంతో మన తెలుగు ఫ్యాన్స్ కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూసారు.

"""/" / అయితే ఆదిపురుష్ నుండి మేకర్స్ టీజర్ ఎప్పుడైతే రిలీజ్ చేసారో అప్పటి నుండి ఈ సినిమాపై ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

ప్రభాస్ ఫ్యాన్స్ కు సైతం ఈ సినిమా టీజర్ నచ్చలేదు.ఇక ఈ ట్రోల్స్ దెబ్బకు ఈ సినిమాను జనవరి నుండి జూన్ 16కు వాయిదా వేశారు.

మళ్ళీ గ్రాఫిక్స్ పనులను స్టార్ట్ చేసి ఫ్యాన్స్ ను మెప్పించే విధంగా విఎఫ్ఎక్స్ వర్క్స్ చేస్తున్నారు.

"""/" / మరి రిలీజ్ కు మరికొద్ది సమయమే ఉంది.దీంతో ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమా మాత్రమే కాదు ప్రభాస్ నటిస్తున్న మిగిలిన సినిమాల నుండి కూడా ఏదైనా అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ మొదటి ప్రియార్టీ ఆదిపురుష్ సినిమానే అని టాక్.

"""/" / ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు మరో సినిమా నుండి ఎలాంటి అప్డేట్ రాకూడదు అని ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడట.

ఈ సినిమా నుండి మాత్రమే అప్డేట్స్ వస్తే అందరి ద్రుష్టి ఆదిపురుష్ మీదనే ఉంటుందని ప్రభాస్ ప్లాన్.

మరి ప్రభాస్ ప్లాన్ బాగానే ఉన్న ఆదిపురుష్ మేకర్స్ మాత్రం ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తున్నారు.

ఇంకా ప్రమోషన్స్ లో ఎలాంటి స్పీడ్ కనిపించక పోవడం ప్రభాస్ అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.

డాక్టరా లేక సైకోనా? ఇండియన్‌ డాక్టర్ చేసిన పనికి అమెరికా ఉలిక్కిపడింది..