ఎట్టకేలకు పెళ్లి విషయంలో నోరు విప్పిన ప్రభాస్... ఆ హీరోకి అయ్యాకే చేసుకుంటా అంటూ కామెంట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగాఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ పెళ్లి గురించి ఎప్పుడు హాట్ టాపిక్ గానే ఉంటుంది.

ఏ కార్యక్రమానికి వెళ్లినా కూడా ప్రభాస్ కి ఇదే ప్రశ్న ఎదురవుతుంది.ఇక సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి తరచూ ఎన్నో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ప్రభాస్ అనుష్కతో డేటింగ్ లో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు రావడంతో ఈ వార్తలను ఖండించారు.

తాజాగా బాలీవుడ్ నటి కృతి సనన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని త్వరలోనే ఈ విషయాన్ని ప్రకటించనున్నారంటూ కూడా వార్తలు వచ్చాయి.

అయితే ఇవన్నీ కూడా ఆ వాస్తవమని కొట్టి పారేశారు.ఇక ప్రభాస్ బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు గోపీచంద్ తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన వస్తుందని అందరూ భావించారు.

అయితే బాలకృష్ణ సైతం ప్రభాస్ ను సరాసరి పెళ్లెప్పుడు అంటూ ప్రశ్నించారు.ప్రభాస్ అందరిని డార్లింగ్ అని పిలవడం అలవాటు ఈ క్రమంలోనే బాలకృష్ణ సభాముఖంగా నన్ను కూడా మీరు డార్లింగ్ అని పిలవాలి అని అడగడంతో అందుకు ప్రభాస్ సరే డార్లింగ్ సార్ అంటూ సమాధానం చెప్పారు.

"""/"/ గత ఎపిసోడ్లో భాగంగా శర్వానంద్ ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని అడగడంతో ప్రభాస్ చేసుకున్న తర్వాతే చేసుకుంటానని చెప్పారు.

మరి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని ప్రశ్నించడంతో నేను సల్మాన్ ఖాన్ చేసుకున్న తర్వాతే చేసుకుంటా అని చెప్పాలేమో అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మొత్తానికి ప్రభాస్ పెళ్లి గురించి బాలయ్య షోలో ప్రస్తావనకు తీసుకురావడంతో అభిమానులు సైతం ఈ ఎపిసోడ్ పై ఎంతో ఆతృత కనబరుస్తున్నారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కౌశిక్ తల్లి చెప్పిన కామెంట్లలో ఏ మాత్రం నిజం లేదు.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ వైరల్!