ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న ప్రభాస్ కొత్త లుక్.. జాగ్రత్త పడకపోతే ఇబ్బందేనా?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం విశ్రాంతి లేకుండా వరుస సినిమాలలో నటిస్తున్నారు.

గ్యాప్ లేకుండా సినిమాలలో నటించడం వల్ల ప్రభాస్ ఫేస్ లో గ్లో తగ్గుతోందని ఫ్యాన్స్ సైతం అభిప్రాయపడుతున్నారు.

ప్రభాస్ లుక్( Prabhas Look ) విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉందని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఐదు నుంచి ఆరు సినిమాలు ఉన్నాయి.ప్రభాస్ జాగ్రత్త పడకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ కల్కి సినిమా( Kalki Movie ) రిలీజ్ కు సరిగ్గా 40 రోజుల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమాకు ప్రమోషన్స్ జరుగుతున్నా మరీ భారీ స్థాయిలో అయితే జరగడం లేదు.

కల్కి సినిమా స్థాయికి నెక్స్ట్ లెవెల్ లో ప్రమోషన్స్ ను ప్లాన్ చేయాల్సిన అవసరం అయితే ఉందని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

"""/" / కల్కి సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమా అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా బిజినెస్ పరగంగా కూడా టాప్ లో ఉందనే సంగతి తెలిసిందే.

కల్కి సినిమాలో దిశా పటాని,( Disha Patani ) దీపికా పదుకొనే( Deepika Padukone ) హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఈ హీరోయిన్లు తెలుగులో కూడా బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కల్కి సినిమాలో షాకింగ్ ట్విస్టులు ఉండబోతున్నాయని తెలుస్తోంది. """/" / ప్రభాస్ నటుడిగా సినిమా సినిమాకు నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.

ప్రభాస్ ఒక సినిమాకు 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

ఇతర భాషల్లో సైతం నటుడిగా ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్న ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో ఎలాంటి ఫలితాలను అందుకుంటారో చూడాలి.

కల్కి ప్రమోషన్స్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.కల్కి సినిమాలో విజువల్ ఎఫెక్స్ట్స్ కు ప్రాధాన్యత ఎక్కువగానే ఉందని తెలుస్తోంది.

వైసీపీకి మరో కీలక నేత రాజీనామా .. జగన్ రియాక్షన్ ఏంటో ?