Prabhas: నేషనల్ అవార్డ్స్ కమిటీపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్.. ప్రభాస్ ప్రతిభ కనబడలేదా అంటూ?

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా కూడా తాజాగా జరిగిన 69వ నేషనల్ అవార్డ్స్( 69th National Awards ) గురించే చర్చించుకుంటున్నారు.

అయితే తెలుగులో ఆర్ఆర్ఆర్, పుష్ప వంటి సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ నేషనల్ అవార్డులు బాహుబలి సినిమాకు అలాగే హీరో ప్రభాస్ కి( Prabhas ) రాకపోవడం పట్ల ప్రభాస్ అభిమానులు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడంతో పాటు నేషనల్ అవార్డు కమిటీ పై మండిపడుతున్నారు.

ఈ నేషనల్ అవార్డు కమిటీకి ప్రభాస్ కష్టం, ప్రతిభ కనిపించలేదా? అంటూ ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు.

స్టార్ట్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమా( Baahubali Movie ) రెండు పార్ట్ లుగా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా భారీగా గుర్తింపు తెచ్చుకోవడం తోపాటు తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన సినిమాకు అవార్డులు రాకపోవడం ఏంటంటూ ప్రభాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

బాహుబలి సినిమా కోసం ప్రభాస్ ఐదేళ్లపాటు ఎంతో శ్రమించాడు.అందుకు తగ్గట్టుగానే సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ కూడా పెరిగింది.

మరి అటువంటిది ప్రభాస్ ప్రతిభను ఏ కమిటీ కూడా గుర్తించలేదు.ఈ నేషనల్ అవార్డ్స్ కమిటీ అప్పుడేమయ్యింది అంటూ ప్రభాస్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"""/" / అల్లు అర్జున్ కి( Allu Arjun ) వచ్చినందుకు సంతోషంగానే ఉంది అలా అని మేము బాధపడటం లేదు కానీ ప్రభాస్ ప్రతిభను గుర్తించనందుకు మాకు కోపంగా ఉంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి లాంటి భారీ సినిమాతో మొట్టమొదటి పాన్ ఇండియా హిట్ కొట్టి ఇప్పటికీ తన రికార్డ్‌ని పదిలంగా కాపాడుకుంటున్న ప్రభాస్ స్టామినాని కమిటీ చూడలేకపోయిందా.

లేదంటే మరేదన్నా కారణం ఉందా? ఏదైనా జరిగిందా? అంటూ ప్రభాస్ ఫాన్స్( Prabhas Fans ) ప్రశ్నిస్తున్నారు.

"""/" / నిజానికి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన సినిమా బాహుబలి అని చెప్పవచ్చు.

మరి అటువంటి బాహుబలి సినిమాకు అలాగే అందులో నటించిన హీరో ప్రభాస్ కు అవార్డ్స్ రాకపోవడం ఏంటంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు.

ఆ సినిమాలో ప్రభాస్ నటనకు నిజంగానే జనాలు నీరాజనాలు పలికారు.కానీ, ప్రభాస్‌ని మాత్రం జాతీయ అవార్డ్ కమిటీ( National Awards Jury ) పట్టించుకోలేదు.

ఇదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పిస్తుంది.మరి ఈ విషయంపై జాతీయ అవార్డు కమిటీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

నీకు నోరు ఊరుకోదు..నెటిజన్స్ స్క్రోలింగ్ ఆపరు.. ఎందయ్య మాకు ఈ కర్మ