మహేష్ కు సాధ్యం కానిది ప్రభాస్ చేసి చూపించారుగా.. విజువల్స్ మాత్రం అద్భుతమంటూ?

కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) మురుగదాస్ కాంబినేషన్ లో స్పైడర్( Spyder Movie ) అనే సినిమా తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.

ఈ సినిమా టీజర్ లో స్పైడర్ ను చూపించి ఈ సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ ఏమో అని అభిప్రాయం కలిగించిన మేకర్స్ సినిమాలో మాత్రం స్పైడర్ ను చూపించకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు.

అయితే మహేష్ కు సాధ్యం కానిది ప్రభాస్( Prabhas ) చేసి చూపించారుగా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) సినిమాలో బుజ్జి అనే పాత్ర ఉండగా బుజ్జి సినిమాలో ప్రభాస్ కు సంబంధించిన వాహనం కావడం గమనార్హం.

కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ తో బుజ్జి పాత్రను పరిచయం చేయగా ఈ పాత్ర సినిమాపై అంచనాలను ఊహించని స్థాయిలో పెంచేసిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కల్కి 2898 ఏడీ సినిమాలో బుజ్జి( Bujji ) పాత్రను మే 22వ తేదీన పూర్తిస్థాయిలో రివీల్ చేయనున్నారు.

"""/" / కల్కి సినిమా సక్సెస్ లో బుజ్జి కీలక పాత్ర పోషిస్తుందని బుజ్జికి కీర్తి సురేష్( Keerthy Suresh ) వాయిస్ ఓవర్ ఎంతగానో ప్లస్ అయిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

చిన్నపిల్లలు కల్కి సినిమాపై ఆసక్తి చూపించడంలో బుజ్జి పాత్ర కీలకం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. """/" / కల్కి 2898 ఏడీ రిలీజ్ సమయానికి భారీ స్థాయిలో అంచనాలు పెంచేలా మేకర్స్ ప్లాన్ ఉందని భోగట్టా.

కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుందని అంచనాలను మించి సినిమా ఉండేలా మేకర్స్ ప్లాన్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ స్థాయిని పెంచే సినిమాలలో కల్కి సినిమా కూడా ఒకటని ఈ విషయంలో ఎలాంటి సందేహాలు, అనుమానాలు అక్కర్లేదని భోగట్టా.

మహేష్ కు స్పైడర్ లో సాధ్యం కానిది ప్రభాస్ కు కల్కిలో సాధ్యమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మే నెల టాలీవుడ్ బాక్సాఫీస్ రివ్యూ.. 25 సినిమాలు విడుదలైతే ఒక్క హిట్ కూడా లేదా?