Prashanth Neel Salaar: సలార్ యాక్షన్ సినిమా కాదని ప్రశాంత్ ఈ సినిమాకు ఒప్పించారా…మరి ఇదేంటి నీల్!
TeluguStop.com
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) నటించినటువంటి తాజా చిత్రం సలార్(Salaar).
ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఇలా ఈ సినిమా విడుదలైనటువంటి మొదటి షో నుంచి మొదలుకొని పెద్ద ఎత్తున పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా అభిమానులను పెద్ద ఎత్తున సందడి చేస్తోంది.
అన్ని ఏరియాలలో ఈ సినిమా అద్భుతమైనటువంటి కలెక్షన్లను రాబడుతుంది.ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా అన్ని ప్రాంతాలలోనూ భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుందని తెలుస్తుంది.
"""/" /
ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా అంటేనే హీరోలను ఎలివేట్ చేసేలాగా ఉంటాయనే విషయాన్ని కే జి ఎఫ్ సినిమా ద్వారానే నిరూపించారు.
ఈయన సినిమాలన్నీ కూడా హీరోల పాత్రలకే ప్రాధాన్యత ఉంటాయని అంతేకాకుండా భారీ యాక్షన్స్ సన్నివేషాలతో కూడుకొని ఉంటాయని చెప్పాలి.
ఇక ఈ సినిమాను కూడా అలాగే ఉంటుందని అభిమానులు భావించారు.ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి ట్రైలర్ టీజర్ కనుక చూస్తే తప్పకుండా ఈ సినిమా కూడా యాక్షన్ సినిమానేనని(
Action Movie ) ఇందులో డ్రామా ఉండదు అంటూ చాలామంది భావించారు.
"""/" /
ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ప్రశాంత్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.
సలార్ అనేది యాక్షన్ సినిమా కాదని ఇందులో యాక్షన్ కంటే డ్రామాని ఎక్కువగా ఉంటుందని తెలియజేశారు.
అంతేకాకుండా ఈ డ్రామాలో వచ్చే ఎమోషనల్ సీన్స్( Emotional Scenes ) అందరిని ఆకట్టుకుంటాయని ఈయన తెలిపారు.
అయితే ఈయన చెప్పినట్టుగానే ఈ సినిమాలో కేవలం యాక్షన్ సన్నివేశాలకు మాత్రమే కాకుండా డ్రామాతో కూడుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చిందని చెప్పాలి.
తాను ట్రైలర్లో అలా చూపించినప్పటికీ ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయని ప్రశాంత్ తెలిపారు.
"""/" /
ఇక నేను ప్రభాస్ కి కథ చెప్పే సమయంలో ఈ సినిమా డ్రామా సినిమా( Drama Movie ) అని చెప్పి ప్రభాస్ ను ఒప్పించాను అంటూ ఈ సందర్భంగా ప్రశాంత్ కామెంట్స్ చేశారు.
ఇక సలార్ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి విషయాన్ని ఇదివరకే మేకర్స్ వెల్లడించారు.
ఇక ఈ సినిమా మొదటి పార్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోగా రెండు భాగంపై కూడా భారీ స్థాయిలోనే అంచనాలు ఏర్పడ్డాయి.
బాహుబలి 1 సినిమాని చేస్తున్న తర్వాత ప్రభాస్ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలోనే ప్రేక్షకుల అంచనాలను చేరుకుందని చెప్పాలి.
ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే జుట్టు రాలడం దెబ్బకు ఆగుతుంది!