ప్రభాస్ కు ఆ స్టార్ హీరో పోటీనా.. హిట్టైతే మాత్రమే సినిమా చూస్తారంటూ?
TeluguStop.com
స్టార్ హీరో ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ మార్చి 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ సినిమా విడుదలకు మరో ఐదు వారాల సమయం మాత్రమే ఉంది.రాధేశ్యామ్ రిలీజ్ డేట్ అనుకూల డేట్ కాదని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అదే సమయంలో సూర్య నటించిన ఈటీ సినిమా తమిళంలో రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి.
అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ప్రభాస్ కు, సూర్యకు పోటీ ఏమిటని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
తెలుగులో ప్రభాస్ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు వస్తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నార్త్ ఇండియాలో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
రాధేశ్యామ్ రిలీజ్ కు ఒక్కరోజు ముందు తమిళంలో ఈటీ సినిమా రిలీజ్ కానుంది.
"""/"/
రెండు సినిమాలకు హిట్ టాక్ వస్తే రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రభాస్ సినిమాకు తమిళంలో కొంత మొత్తం తక్కువగా కలెక్షన్లు వచ్చినా మొత్తం కలెక్షన్లపై ఆ ప్రభావం అయితే ఉండదని ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ వల్ల ప్రస్తుత కాలంలో పెద్ద సినిమాల మధ్య పోటీ అనివార్యమైంది.
"""/"/
రాధేశ్యామ్, ఈటీ సినిమాలు వేర్వేరు జానర్స్ లో తెరకెక్కుతున్నాయని అందువల్ల ఒక సినిమాపై మరో సినిమా ప్రభావం చూపే అవకాశాలు అయితే తక్కువని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
రాధేశ్యామ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా చివరకు మార్చి 11వ తేదీని ఫిక్స్ చేశారు.
ఆరోజు కూడా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడితే మే నెలలో ఈ సినిమా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
పెద్ద సినిమాల వాయిదా వల్ల నిర్మాతలపై వడ్డీ భారం అంతకంతకూ పెరుగుతోందని సమాచారం అందుతోంది.
ప్రభాస్ తో సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అనిల్.. అలా చెప్పడంతో?