Prabhas : భోజన ప్రియుడు అయిన ప్రభాస్ కి ఆ ఫుడ్ అంటే అస్సలు ఇష్టం లేదా?
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి వారిలో నటుడు ప్రభాస్( Prabhas ) ఒకరు.
ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు అయితే బాహుబలి సినిమా తర్వాత ఈయన కెరియర్ పూర్తిగా మారిపోయిందని చెప్పాలి.
ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
బాహుబలి సినిమా తర్వాత ఈయన మరో నాలుగు పాన్ ఇండియా సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఇటీవల సలార్ సినిమా( Salaar ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ మంచి సక్సెస్ అందుకున్నారు.
త్వరలోనే మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ప్రభాస్ సినీ కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ సాధించారు.
ఇక ప్రభాస్ గురించి ఇండస్ట్రీలో ఏ సెలబ్రిటీలను అడిగినా కూడా ముందు ఆయన పెట్టే ఫుడ్డు గురించే మనకు చెబుతూ ఉంటారు.
"""/" /
ప్రభాస్ చాలా మనస్ఫూర్తిగా వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ అన్నింటిని తెప్పించి టీమ్ మొత్తానికి ఫుడ్( Food ) పెట్టిస్తారని ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తెలిపారు.
ప్రభాస్ మాత్రం ఫుడ్ తో చంపుతారు అంటూ చాలామంది ఈయన ఇచ్చే ఆతిథ్యం గురించి గొప్పగా చెప్పారు.
ఇక ప్రభాస్ కూడా చాలా మంచి ఫుడీ అనే విషయం అందరికీ తెలిసిందే.
ఈయన భోజనం చేయాలి అంటే టేబుల్ పై అన్ని రకాల పదార్థాలు ఉండాల్సిందేనని ఏ ఒక్కటి లేకపోయినా తెప్పించుకొని మరి తింటారంటూ ఇదివరకు పలువురు తెలిపారు.
"""/" /
ఇక ప్రభాస్ కి రొయ్యల బిర్యానీ( Prawns Biryani ) అంటే మహా ఇష్టమట ఆ రొయ్యల బిర్యానీ కనుక చూస్తే తాను డైట్ లో ఉన్నా కూడా ఆ విషయం పక్కన పెట్టి ఫుల్లుగా తినేస్తారు.
అంతలా ఈయనకు రొయ్యల బిర్యానీ అంటే ఇష్టమని తెలుస్తుంది.కానీ నచ్చని ఫుడ్ కూడా ఉందని తెలుస్తుంది.
ఆ ఫుడ్ కనుక టేబుల్ మీద ఉంటే ఆయన ఫుడ్ తినడమే మానేస్తారంట అంత చిరాకు ఆ ఫుడ్ అంటే అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.
మరి ఈయనకు అంత చిరాకు తెప్పించే ఆ ఫుడ్ ఐటమ్ ఏంటి అనే విషయానికి వస్తే.
"""/" /
ప్రభాస్ చిన్నప్పటి నుంచి కూడా కాకరకాయ( Bitter Gourd ) అసలు తినడట తన పెదనాన్న బలవంతంగా తినిపించేవాడు కానీ తనకు ఏమాత్రం ఇష్టం లేదట.
కాకరకాయ చేదుగా ఉండటంతో చిన్నప్పటినుంచి కూడా ఈయనకు కాకరకాయ అంటే ఇష్టం లేదని కొన్నిసార్లు కాకరకాయ ఉంటే భోజనం చేయడం కూడా మానేస్తారని తెలుస్తోంది.
డోర్ తీసి మనుషులన్న కారులోకి దూరిన ఎలుగుబంటి.. వీడియో చూస్తే..