ప్రభాస్ కి ఇప్పటివరకు ఓటు హక్కు లేదా… నెట్టింట్లో భారీ ట్రోల్స్!
TeluguStop.com
రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13వ తేదీ ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిసాయి.
తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగగా, ఆంధ్రాలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఒకేసారి జరిగాయి.
ఈ క్రమంలోనే రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.ఇలా ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో ఎంతో మంది సినిమా సెలబ్రిటీలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు ( Vote ) హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు.
"""/" /
ఇక తెలంగాణలో పెద్ద ఎత్తున సెలెబ్రెటీలు ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి మనకు తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ట్ హీరోగా కొనసాగుతున్నటువంటి నటుడు ప్రభాస్( Prabhas )మాత్రం గత కొన్ని నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో అలాగే నిన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కూడా తన ఓటు హక్కును వినియోగించుకోలేదు.
"""/" /
ఇలా ప్రభాస్ ఓటు వేయడానికి రాకపోవడంతో ప్రభాస్ కి ఇప్పటివరకు ఓటు హక్కు లేదా అందుకే ఆయన ఓటు వేయడానికి రాలేదా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రభాస్ ఎక్కడ కూడా తన ఓటు వేయకపోవడంతో ఓటు లేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు.
అయితే సినీ నటుడు హీరో రాజశేఖర్ ( Rajasekhar ) ఓటు వేయడానికి వచ్చారు అయితే ఆయన ఫోటోను షేర్ చేస్తూ.
ప్రభాస్ ఓటు హక్కుని వినియోగించుకున్నాడంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ప్రభాస్ మాధురి ఆయన కూడా తలకు క్యాప్ పెట్టుకొని రావడంతో ప్రభాస్ ఓటు వేశాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.
ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలో అసలు ట్విస్ట్ ఇదేనా.. సినిమా అలా ఉండబోతుందా?