రాజాసాబ్ మూవీతో ఆ రికార్డ్ అందుకోనున్న ప్రభాస్.. కచ్చితంగా సాధ్యం అంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోగా ది రాజాసాబ్( The Rajasaab ) సినిమాతో ప్రభాస్ కచ్చితంగా సక్సెస్ సొంతం చేసుకుంటారని అభిమానులు భావిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కు ఈ సినిమా కచ్చితంగా భారీ హిట్ అందిస్తుందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.

ప్రభాస్ ఈ సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ అందుకుంటారని ప్రస్తుతం కొంతమంది హీరోలు మాత్రమే హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటున్నారని స్టార్ హీరో ప్రభాస్ కూడా ఈ జాబితాలో చేరడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ది రాజాసాబ్ మూవీ హిట్ కావడం పక్కా అని ఫ్యాన్స్ చెబుతున్నారు.ప్రభాస్ సైతం ఈ సినిమాకే ఎక్కువగా డేట్స్ కేటాయించారని తెలుస్తోంది.

"""/" / 2025 సంవత్సరం ఫస్టాఫ్ లో ఈ సినిమా విడుదల కానుండగా సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10వ తేదీన విడుదల కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

పెద్దగా పోటీ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.ది రాజాసాబ్ సినిమాలో క్రేజీ హీరోయిన్లు ప్రభాస్ కు జోడీలుగా నటిస్తున్నారు.

ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. """/" / ఈ సినిమా కోసం విల్లా నిర్మించారని మారుతి( Maruthi ) ఈ సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమాకు సంబంధించిన సెట్ సిద్ధమైందని భోగట్టా.ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండగా రాబోయే రోజుల్లో ప్రభాస్ భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.

జర్మనీలో విషాదం : మూడు రోజుల క్రితం అదృశ్యం .. బాత్‌రూమ్‌లో శవమై తేలిన భారతీయ విద్యార్ధి